Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్లు త్యాగం చేయాలంటున్న చంద్ర‌బాబు నాయుడు!

By:  Tupaki Desk   |   26 Jan 2020 7:00 AM IST
త‌మ్ముళ్లు త్యాగం చేయాలంటున్న చంద్ర‌బాబు నాయుడు!
X
మండ‌లి లో వికేంద్రీక‌రణ బిల్లును అడ్డుకున్న‌ది కేవ‌లం తాత్కాలిక‌మే. ఆ బిల్లును మండ‌లి అడ్డుకున్నా మూడు నెల‌ల్లో అది చ‌ట్ట‌రూపం దాల్చే అవ‌కాశం ఉంది. అయినా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు కావాల‌ని అడ్డుపుల్ల వేశార‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీలే బాగా ఫీల్ అవుతున్నార‌నే ప్ర‌చారం సాగుతూ ఉంది. ఇప్పుడు ప్ర‌భుత్వం మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం గ‌నుక తీసుకుంటే..తెలుగుదేశం ఎమ్మెల్సీలంతా త‌మ హోదాల‌ను కోల్పోతారు. మాజీ ఎమ్మెల్సీలుగా మిగిలిపోతారు. ఇలాంటి నేప‌థ్యంలో ఇలా ప‌ద‌వుల‌ను కోల్పోయే వారు చంద్ర‌బాబును విమ‌ర్శిస్తున్నారు అనే ప్ర‌చారం సాగుతూ ఉంది.

ఇలాంటి నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్ల‌ కు చంద్ర‌బాబు నాయుడు ఒక సందేశం ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. అదేమిటంటే.. త్యాగం చేయ‌డం! తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల తిర‌స్క‌ర‌ణ‌కు గురి అయిన నేప‌థ్యంలో, అధికారాన్ని కోల్పోయిన నేప‌థ్యంలో.. ఇప్పుడు త్యాగాలు చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు నాయుడు చెబుతున్నార‌ట‌. మండ‌లిలో ఎమ్మెల్సీల‌ను ఉద్దేశించే చంద్ర‌బాబు నాయుడు ఈ వ్యాఖ్య‌లు చేశార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

మండ‌లిలో వికేంద్రీక‌ర‌ణ బిల్లుకు అడ్డుప‌డి.. తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఇప్పుడు ప‌ద‌వులు కోల్పోతే దానికి త్యాగం అని పేరు పెడుతున్నారు తెలుగుదేశం అధినేత‌. వారంద‌రూ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని కూడా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించార‌ట‌! తెలుగుదేశం పార్టీకి పోరాటాలు కొత్త కాద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చార‌ట‌. 1984లో ఎన్టీఆర్ కోసం తెలుగుదేశం చేసిన తిరుగుబాటు చ‌రిత్ర‌ కు ఎక్కింద‌ని, ఇప్పుడు మ‌రోసారి అలాంటి పోరాట‌మే జ‌రుగుతోంద‌ని అంటున్నార‌ట చంద్ర‌బాబు నాయుడు.

మొత్తానికి మండ‌లి ర‌ద్దు అయితే తెలుగు దేశం పార్టీ లో త‌న మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను, తిరుగు బాటును ఎదుర్కోవ‌డానికి చంద్ర‌బాబు నాయుడు ఇలా త్యాగం అంటూ ఊర‌డించే మాట‌ల‌ను చెబుతున్న‌ట్టుగా ఉన్నారు. వీటిని ప‌ద‌వులు కోల్పోతే తెలుగుదేశం ఎమ్మెల్సీలు యాక్సెప్ట్ చేస్తారా?