Begin typing your search above and press return to search.

జగన్ మేనమామను కలిసిన చంద్రబాబు.. ఏంటి కథ?

By:  Tupaki Desk   |   21 April 2022 4:29 AM GMT
జగన్ మేనమామను కలిసిన చంద్రబాబు.. ఏంటి కథ?
X
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అంతలా విభేదాలు పొడచూపాయి. చంద్రబాబు, జగన్ లు అయితే పాము ముంగిసలా ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. ఇక ఈ రెండు పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులకు లెక్కేలేదు. నారా ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి మధ్య చాలా గ్యాప్ ఉంది.

కానీ తాజాగా ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తూ వైఎస్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. సీఎం వైఎస్ జగన్ ముద్దుల మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.

రవీంద్రనాథ్ రెడ్డిని చంద్రబాబు కలవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పరస్పర శత్రువులుగా చూసుకుంటున్న పరిస్థితి దాపురించిన నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అధికార పార్టీ నేత, జగన్ మేనమామను ప్రతిపక్ష నేత చంద్రబాబు పలకరించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు పొందడానికి చంద్రబాబు వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఉండడం విశేషం.

జగన్ కు స్వయాన మేనమామ అని తెలిసినా కూడా చంద్రబాబు మాత్ర ఆ శషభిషలు ఏమీ పెట్టుకోకుండా రవీంద్రనాథ్ రెడ్డి దగ్గరకు వెళ్లారు. అప్యాయంగా పలకరించారు. రవీంద్రనాథ్ రెడ్డి భుజంపై చంద్రబాబు చేయి వేసి యోగక్షేమాలు ఆరాతీశారు.

ఇలా ప్రత్యర్థులు ఏకం కావడంతో ఈ ఫొటోలను విలేకరులు తెగ తీశారు. వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.జగన్ ఎంత వైరం పెట్టుకున్నా ఆయన మేనమామ మాత్రం ప్రత్యర్థి పార్టీ అధినేతతో ఇలా సామరస్యంగా మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.