Begin typing your search above and press return to search.
ఈ సారైనా..దారిలో పెడతారా? చంద్రబాబు కుప్పం పర్యటన
By: Tupaki Desk | 24 Aug 2022 5:00 AM ISTటీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పా టు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు చాలానే ప్రాధాన్యం ఉంది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో.. చంద్ర బాబుకు వెన్నుదన్నుగా ఉన్న కుప్పంలో ఇప్పుడు పునాదులు కదిలించే ప్రక్రియకు వైసీపీ ఎప్పుడో.. ము హూర్తం పెట్టుకుని.. ఆదిశగా అడుగులు వడివడిగా వేస్తోంది. ఇటీవలే సుమారు 150 మంది కార్యకర్తలను వైసీపీలో చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు.. టీడీపీ నాయకులు ఎవరూ కూడా రోడ్డు మీదకు వచ్చి.. నిరసన గళం వినిపించే పరిస్థితి లేకుం డా పోయింది. అంతేకాదు.. అసలు టీడీపీ కార్యాలయంలోనూ.. స్వేచ్ఛగా కూర్చుని మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని తమ్ముళ్లు లబోదిబోమంటున్నారు.
కుప్పంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు సైతం భయపడుతున్నప రిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి చెప్పాలంటే.. ఈ 40 ఏళ్లకాలంలో చంద్రబాబు పెద్దగా కుప్పంలో పర్యటించింది లేదు.
ఇక్కడ అభివృద్ధి అయితే.. చేశారు కానీ.. ఏనాడూ.. ఇక్కడ తన గెలుపునకు కానీ.. తన పార్టీ పరిస్థితిపై కానీ.. ఆయన చర్చించింది లేదు. కానీ రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు అన్నట్టుగా.. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మారిపోయింది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికి ఆయన దాదాపు 6 సార్లు కుప్పంలో పర్యటించారు. ఇప్పుడు జరుగుతున్న పర్యటన 7వది. అయితే.. ఇప్పుడైనా..ఆయన సరైన దిశానిర్దేశం చేస్తారో లేదో చూడాలి.
ఇప్పటి వరకుజరిగిన సమావేశాల్లో కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగానే.. జూనియర్ ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పగించాలంటూ.. నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. తర్వాత.. పార్టీలో నూ అసమ్మతి వాదు లు రోడ్డెక్కారు. ఇప్పటికీ.. ఇదే సీన్ కనిపిస్తోంది. దీనిని వైసీపీతనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా.. చంద్రబాబు కుప్పంలో బలమైన ననాయకత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.