Begin typing your search above and press return to search.

2020.. చంద్రబాబును ఇంట్లో కూర్చండబెట్టింది!

By:  Tupaki Desk   |   23 Dec 2020 1:30 AM GMT
2020.. చంద్రబాబును ఇంట్లో కూర్చండబెట్టింది!
X
2020.. ఈ శతాబ్ధంలోనే అందరికి గుర్తుండుపోయే సంవత్సరం. ఈ సంవత్సరం ఎన్నో ఉపద్రవాలు చోటుచేసుకున్నాయి. కరోనా దెబ్బకు అన్నీ బంద్ అయిపోయాయి. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబును సైతం కరోనా భయపెట్టింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. ఏపీలో అడుగుపెట్టడానికి కూడా భయపడి ‘జూమ్’ యాప్ లోనే వీడియో కాన్ఫరెన్స్ లతో చంద్రబాబు వెళ్లదీసేలా చేసింది ఈ కరోనా మహమ్మారి. ఈ సంవత్సరం చంద్రబాబు జూమ్ లోనే ఎక్కువగా గడపాల్సి వచ్చింది. ఈ 2020 నిజంగానే చంద్రబాబు టీట్వంటీ ఆడేసింది. చంద్రబాబు ఈ సంవత్సరం ఏం చేశాడన్న దానిపై స్పెషల్ ఫోకస్.

విజన్ 2020.. అంటేనే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు. ఒకప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ 2020కి పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకున్నాడు. మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో చంద్రబాబు హైదరాబాదులోని తన ఇంటికే పరిమితమయ్యారు. చంద్రబాబు మాత్రం ప్రజల్లో ఉన్నా లేకున్నా తన కర్తవ్యంను మాత్రం వీడలేదు. ఏ నాయకుడు చేయనంతగా ఇంట్లోనుంచే నాయకుతో జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్ధేశం చేశారు. దీన్ని వైసీపీ టార్గెట్ చేసి విమర్శలు సంధించారు.

ఇక ఈ ఏడాది ఆరంభంలో జనవరి 1న 2020లో తన భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను ప్రజలను కలిసి వారి ఆందోళనలకు మద్దతు తెలిపారు.

ఇక కరోనా వేళ హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు జూమ్ కే పరిమితమయ్యాడు. వైసీపీ నాయకులు అయితే కరోనా దెబ్బకు చంద్రబాబు కరకట్ట వీడారని కూడా సెటైర్లు వేశారు. తెలంగాణలోని అధికారిక టీఆర్ఎస్ పార్టీ కూడా చంద్రబాబుపై సెటైర్లు వేయడం ప్రారంభించింది. చంద్రబాబు ప్రజలకు ఎంటర్‌టెయినర్‌గా మారిపోయాడని టీఆర్ఎస్ కీలక నేతలు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చంద్రబాబు 2020 సంవత్సరంలో ఎక్కువగా ఇంటికే పరిమితయ్యాడని చెప్పొచ్చు.