Begin typing your search above and press return to search.

త‌ప్పుచేసి స‌రిదిద్దుకునే ప‌నిలో చంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   26 Oct 2020 9:15 AM IST
త‌ప్పుచేసి స‌రిదిద్దుకునే ప‌నిలో చంద్ర‌బాబు!
X
అడుసు తొక్క‌నేల‌.. కాలు క‌డ‌గ‌నేల‌.. అనేది సామెత‌. ఇప్పుడు ఈ సామెతను టీడీపీ అధినేత, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు నిజం చేస్తున్నార‌ట‌. ఈ విష‌య‌మే టీడీపీలో చ‌ర్చ‌గా మారింది. ``ముందు త‌ప్పులు చేసేస్తారు. త‌ర్వాత తీరిగ్గా వాటిని స‌మీక్షించుకుని.. స‌రిచేసుకోవ‌డం మొద‌లు పెడ‌తారు. ఇలా చేసే క‌దా.. మాకు విలువ లేకుండా చేశారు!``-అని టీడీపీ సీనియ‌ర్లు ఒకింత ప‌రుషంగానే వ్యాఖ్యానిస్తుం డ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. దీంతో ఏం జ‌రిగింది? చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు ఏంటి? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఈ ఫ‌లితాల‌తో ఒక‌వైపు పార్టీ అధినేత తేరుకోక‌ముందుగానే.. సీనియ‌ర్లు.. శిద్ధా రాఘ‌వరావు, క‌ర‌ణం బ‌లరాం వంటివారు పార్టీకి దూర‌మ‌య్యారు. జూనియ‌ర్లు.. వంశీ, మ‌ద్దాలి గిరి వంటివారు కూడా పార్టీని విడిచి పెట్టారు. దీంతో ఉన్న‌వారితోనైనా పార్టీని లైన్‌లో పెట్టుకునేందుకు చంద్ర‌బాబు అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో ప‌ద‌వులు పంచారు. గ‌తంలో లేని విధంగా పార్ల‌మెంట‌రీ జిల్లాల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇక‌, రాష్ట్ర క‌మిటీని కూడా బ‌లోపేతం చేసేలా.. నేత‌ల‌ను మార్చారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క నేత‌ల‌ను ఆయ‌న దూరం పెట్టారు.

పార్టీలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా సేవ‌లందిస్తున్న న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, పంచుమ‌ర్తి అనురాధ‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ ఇంచార్జ్ బుద్ధా వెంక‌న్న, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర‌దేవ్‌, గిరిజ‌న నాయ‌కురాలు గిడ్డి ఈశ్వ‌రి, ఎస్సీ నాయ‌కురాలు, టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉన్న‌(మ‌ధ్య‌లో పార్టీ మారినా.. త‌ర్వాత సొంత గూటికి చేరుకున్నారు) ఉప్పులేటి క‌ల్ప‌న‌, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, క‌ర్నూలు న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు టీజీ భ‌ర‌త్, కృష్ణాజిల్లాకు చెందిన కాగిత కుటుంబం, మండ‌లి బుద్ధ ప్ర‌సాద్, వేద‌వ్యాస్‌ వంటి చాలా మందికి పార్టీలో ప‌ద‌వులు ఇవ్వ‌లేదు.

దీంతో వీరంతా కూడా పార్టీపై అల‌కబూనారు. ``పార్టీకి గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా ప‌నిచేస్తున్నాం. అయినా మాకు అన్యాయ‌మే జ‌రిగింది`` అని ఒక‌రిద్ద‌రు అంటే.. ``మాక‌న్నా.. మాట్లాడేవారు ఎవ‌రున్నారు? `` అని అఖిల ప్రియ వంటివారు ఫైర‌వుతున్నారు. దీంతో వీరంద‌రికి ఇప్పుడు చంద్ర‌బాబు ఫోన్లు చేసి బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టారు. మ‌రిన్ని ప‌ద‌వులు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే ఛాన్స్ ఇస్తాన‌ని ఆయ‌న చెబుతున్నార‌ట‌. అయితే, త‌మ్ముళ్లు మాత్రం అల‌క వీడ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న కొంద‌రు .. అడుసు తొక్క‌డం ఎందుకు? ఇలా బ‌తిమాల‌డం ఎందుకు? అని స‌టైర్లు పేలుస్తున్నారు. కానీ, పార్టీ అన్నాక‌.. అనేక చేర్పులు.. మార్పులు త‌ప్ప‌ద‌ని.. అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చాలంటే అయ్యే ప‌నికాద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏదేమైనా.. పార్టీలో నెల‌కొన్న ఈ అసంతృప్తి ఎప్ప‌టికి పోతుందో చూడాలి.