Begin typing your search above and press return to search.

మోదీ టూర్ వాయిదా!... బాబు ఊపిరి పీల్చుకున్న‌ట్టే!

By:  Tupaki Desk   |   28 Dec 2018 10:45 AM GMT
మోదీ టూర్ వాయిదా!... బాబు ఊపిరి పీల్చుకున్న‌ట్టే!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు గ‌త కొన్ని రోజులుగా చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లుగా త‌న‌కు తానే చెప్పేసుకున్నారు. ఏ ఒక్క‌రూ త‌న‌ను టార్గెట్ చేయ‌కున్నా కూడా బాబు ఉలిక్కిప‌డ్డ‌ట్ట‌ట్టుగా వ్య‌వ‌హించిన తీరు కూడా నిజంగానే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. అయితే నేటి ఉద‌యం త‌న ప్ర‌భుత్వ ప‌నితీరు పై ఆరో శ్వేత‌ ప‌త్రాన్ని విడుద‌ల చేసిన సంద‌ర్భంగా చంద్ర‌బాబులో కాస్తంత రిలీఫ్ క‌నిపించింది. నిన్న‌టిదాకా బాబు మోములో క‌నిపించని ఓ ర‌కైన ఊర‌ట చాలా స్ప‌ష్టంగానే క‌నిపించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న‌టిదాకా ఏ ఒక్క‌రు అడ‌గ‌కున్నా కూడా కేంద్ర ప్ర‌భుత్వం పైనా, ప్ర‌త్యేకించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పైనా త‌న‌ దైన శైలిలో విరుచుకుప‌డట‌మే కాకుండా అర‌చి గోల పెట్టిన చంద్ర‌బాబు... నేటి మీడియా స‌మావేశంలో మీడియా ప్ర‌తినిధులు ప్ర‌త్యేకించి మోదీ పేరును ప్ర‌స్తావించినా కూడా బాబు చాలా కూల్‌ గా స‌మాధానాలు చెప్పేశారు. మోదీ టూర్‌ పై మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన బాబు... మోదీ వ‌స్తున్నారు క‌దా... చూద్దాం... ఏ మాట్లాడ‌తారో? అన్న కోణంలో చాలా తీరుబ‌డిగా స‌మాధానం ఇచ్చారు.

అదే నిన్న‌టి ప‌రిస్థితి తీసుకుంటే... మా రాష్ట్రానికి ఎందుకొస్తున్నారు? మేం చ‌చ్చామో, బ‌తికామో చూడ‌టానికి వ‌స్తున్నారా? మీ టూర్‌ ను అడ్డుకుంటాం. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం హోదాలో నేను స్వాగ‌తం ప‌ల‌క‌ను. ప్ర‌జ‌లంతా నిర‌స‌న తెల‌పాలి. అస‌లు మోదీని రాష్ట్రంలో అడుగుపెట్ట‌నివ్వ‌బోం అంటూ రంకెలేసిన చంద్ర‌బాబు... నేటి ఉద‌యం మాత్రం చాలా కులాసాగా క‌నిపించిన వైనం నిజంగానే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. అయితే ఓ రోజు తిర‌క్కుండానే బాబు వైఖ‌రిలో వ‌చ్చిన ఈ మార్పుకు కార‌ణ‌మేమిట‌న్న అంశం పై కాస్తంత లోతుగా ప‌రిశీలిస్తే మాత్రం... ఆ ఆశ్చ‌ర్యం స్థానంలో ఇంకేదో ఫీలింగ్ క‌ల‌గ‌క మాన‌దు. బాబు వైఖ‌రిలో వ‌చ్చిన మార్పు వెన‌క ఉన్న కార‌ణం విష‌యంలోకి వ‌స్తే... మోదీ త‌న ఏపీ టూర్‌ ను వాయిదా వేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు వ‌చ్చాయన్న వార్త‌లు వినిపిస్తున్నాయి క‌దా. ఈ వార్త‌లు తెలిసిన వెంట‌నే... అప్ప‌టిదాకా మోదీ పై అంతెత్తున ఎగిరిన చంద్ర‌బాబు... మోదీ రావ‌డం లేద‌ని తెలియ‌డంతో ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయారట‌.

ఎందుకంటే... మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తే... చంద్ర‌బాబు రోజూ చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం ఇచ్చి తీర‌తార‌న్న వాద‌న ఉంది క‌దా. అస‌లే మాట‌ల మాంత్రికుడైన మోదీ నోట నుంచి వ‌చ్చే తూటాల‌కు కాక‌లు తీరిన యోధులే క‌ళ్లు తేలేసే ప‌రిస్థితి. అలాంటిది కేంద్రం పై త‌న‌దైన శైలిలో హాట్ కామెంట్లు చేస్తున్న చంద్ర‌బాబును మోదీ అంత ఈజీగా వ‌ద‌ల‌రు క‌దా. మోదీ సంధించే ప్ర‌శ్న‌లు, బాణాల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క నిన్న‌టిదాకా బాబు ఎగిరార‌ట‌. అయితే మోదీ టూర్ వాయిదా ప‌డింద‌న్న వార్త తెలియ‌గానే... బాబులోని ఆందోళ‌న స్థానంలో ప్ర‌శాంత‌త నెల‌కొంద‌ట‌. ప్ర‌శాంత‌త అంటే మామూలు ప్ర‌శాంత‌త కాదు... రోజుల త‌ర‌బ‌డి ఊపిరి పీల్చులేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న స‌మ‌యంలో స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ ల‌భించినంత ఆనందంగా. అయినా మోదీ టూర్ వాయిదా వెనుక ఉన్న కార‌ణాల‌ పైనా అప్పుడే విశ్లేష‌ణ‌లు మొద‌లైపోయాయి. మోదీ ఏపీకి వ‌స్తే... త‌న రంగు బ‌య‌ట‌ప‌డిపోతుంద‌న్న భావ‌న‌తో స్వ‌యంగా రంగంలోకి దిగిన చంద్ర‌బాబు... ఢిల్లీలోని బీజేపీ కీల‌క నేత‌ల‌ను ప‌ట్టుకుని మోదీ టూర్ ను వాయిదా వేయించార‌న్న‌ది వీటిలో ప్ర‌ధాన‌మైన‌ది.

ఇంటా బ‌య‌టా వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మోదీ వ‌స్తే... త‌న ప‌రిస్థితి మ‌రింత‌గా విష‌మిస్తుంద‌ని, ఎలాగైనా మోదీ టూర్ ను నిలిపివేయించాల‌ని చంద్ర‌బాబు... స‌ద‌రు క‌మ‌లం నేత కాళ్లావేళ్లా ప‌డిన‌ట్టుగా కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో ఏ మేర నిజ‌ముందో తెలియ‌దు గానీ... మోదీ టూర్ వాయిదాతో మాత్రం బాబు ఇప్పుడు బాగా రిలీఫ్ గా క‌నిపిస్తున్నారు. అయితే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను వెంట‌బ‌డి మ‌రీ వారి ప‌త‌నాన్ని చ‌విచూసే దాకా వ‌ద‌ల‌డ‌ని పేరున్న ప్ర‌ధాని... బాబును ఏ మేర‌కు వ‌దిలేస్తార‌న్న‌దే ఇప్పుడు అంద‌రి నోటా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. త‌న‌ను నేరుగా టార్గెట్ చేస్తున్న బాబును ఉతికి ఆరేసే విష‌యాన్ని మోదీ అంత ఈజీగా ప‌క్క‌న‌ పెట్టేసే స‌మస్యే లేద‌ని, ఇప్పుడు ఏపీ టూర్ వాయిదా ప‌డినా త్వ‌ర‌లోనే మోదీ ఏపీకి వ‌స్తార‌ని, బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తార‌న్న విశ్లేష‌ణ‌లు కూడా సాగుతున్నాయి. అయితే మోదీ ఏపీ టూర్ మ‌ళ్లీ ఖ‌రార‌య్యే దాకా వ‌ర‌కు మాత్రం బాబు బాగానే ఊపిరి పీల్చుకుంటార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.