Begin typing your search above and press return to search.

వాళ్లకు చ‌వ‌క‌గా భూములు క‌ట్ట‌బెడుతున్న బాబు?

By:  Tupaki Desk   |   9 Dec 2018 7:41 AM GMT
వాళ్లకు చ‌వ‌క‌గా భూములు క‌ట్ట‌బెడుతున్న బాబు?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జా కూట‌మికి టీడీపీ అధినేత - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పెద్ద దిక్కుగా నిలిచారు! ఆర్థిక - అంగ‌బ‌లం స‌మ‌కూర్చారు. కూట‌మి త‌ర‌ఫున మీడియాలో ప్ర‌చారానికే ఆయ‌న దాదాపు రూ.200 కోట్లు వ్య‌యం చేశార‌ని తెలుస్తోంది. టీఆర్ఎస్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు, పోలీసుల నిఘా కార‌ణంగా స‌మ‌యాని కి ఆంధ్రా నుంచి డ‌బ్బు త‌ర‌లింపు పూర్తి కాక‌పోవ‌డంతో ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు బాబుకు అండ‌గా నిలిచార‌ని.. వాళ్లే డ‌బ్బు స‌ర్దార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాబుకు డ‌బ్బులు స‌మ‌కూర్చిన సెల‌బ్రిటీలంతా ఆయ‌న‌కు, కాపు సామాజిక వ‌ర్గానికి స‌న్నిహితులేన‌ట‌. తెలంగాణ ఎన్నిక‌ల హ‌డావుడి పూర్త‌య్యాక - పోలీసుల నిఘా త‌గ్గాక డ‌బ్బు తిరిగి ఇవ్వాల‌ని బాబు తో వారు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తొలుత ప‌లువురు చెవులు కొరుక్కున్నారు. అయితే - ఇప్పుడు ఓ స‌రికొత్త ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది.

తెలంగాణ‌లో త‌న‌కు సాయం చేసిన సెల‌బ్రిటీల రుణం బాగా గ‌ట్టిగానే తీర్చుకుంటున్నార‌ట‌. వైజాగ్ చుట్టుప‌క్క‌ల వారికి భూములు క‌ట్ట‌బెడుతున్నార‌ట‌. అది కూడా ఎంత చ‌వ‌క‌గానో తెలుసా.. తెలంగాణ‌ లో త‌న‌కు ఒక్క రూపాయి ఇచ్చిన‌ వారికి ప్ర‌తిఫ‌లంగా 10 రూపాయ‌ల విలువ గ‌ల భూమి అని వినికిడి. టాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

అధికారం చేతి లో ఉంది క‌దా అని చంద్రబాబు త‌న స‌న్నిహితుల‌కు ఇష్టారీతిన భూములు క‌ట్ట‌డం ఏంటని ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ విష‌యానికి సంబంధించి నిజా నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని, చంద్ర‌బాబు బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.