Begin typing your search above and press return to search.
చంద్రబాబులో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్..ఇదే నిదర్శనం
By: Tupaki Desk | 21 Sept 2021 10:05 AM ISTప్రపంచంలో ఎక్కడేమి జరిగినా వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడేసి బురదచల్లేసేదాక చంద్రబాబునాయుడు అండకో కు నిద్రపట్టేట్లు లేదు. తాజాగా బయటపడిన ఓ విషయమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రు. 9 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ హెరాయిన్ రవాణాకు విజయవాడ, సత్యనారాయాణపురంలో ఉన్న అడ్రస్ ఉంది. సదరు ఆషీ ట్రేడింగ్ కంపెనీకి ఓనర్ మాచవరం సుధాకర్ అనే తూర్పుగోదావరి వ్యక్తి.
ఈ సుధాకర్ చాలా కాలంగా చెన్నైలోనే ఉంటున్నారు. విజయవాడలోని అడ్రస్ ను కేవలం రిజిస్ట్రేషన్ అడ్రస్ గా మాత్రమే వాడుకుంటున్నాడు. అంతేకానీ పట్టుబడిన హెరాయిన్ విజయవాడకు తరలించటానికి, కానీ లేదా విజయవాడ కేంద్రంగా వ్యాపారం చేయటానికి కానీ ఎలాంటి సంబంధంలేదని పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే ఈఫ్ఘనిస్ధాన్ నుండి భారత్ కు వస్తున్న హెరాయిన్ అంతా వేర్వేరు పోర్టుల ద్వారా చెన్నైకి చేరుకుంటున్నట్లు ఇఫ్పటికే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులతో పాటు చెన్నై, ఏపి పోలీసులు కూడా గుర్తించారు.
వాస్తవం ఇలాగుంటే సోమవారం సమావేశమైన టీడీపీ వ్యూహకమిటి నేతలు మాత్రం పట్టుబడ్డ ఆఫ్ఘన్ హెరాయిన్ కు తాడేపల్లితో లింకులున్నట్లు ప్రచారం మొదలుపెట్టింది. ఆఫ్ఘన్ స్మగ్లర్లతో తాడేపల్లికి లింకులు లేకపోతే అంత భారీ ఎత్తున మదకద్రవ్యాలను ఏపికి తరలించే ఏర్పాట్లు ఎలా జరుగుతాయని నేతలు ప్రశ్నించారు. పట్టుబడిన హెరాయిన్ను ఏపికి తరలించబోతున్నట్లు ఎవరు చెప్పలేదు. అందుకు ఆధారాలు కూడా ఏమీలేవు. పైగా హెరాయిన్ చెన్నైకి చేరటానికే ముంద్రా పోర్టులో ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ విషయాలేవీ పట్టించుకోకుండా జగన్ పై బురదచల్లేస్తున్నారు.
పదేపదే టీడీపీ నేతలు తాడేపల్లి అని ఆరోపించటం వెనుక డైరెక్టుగా జగన్ కి సంబంధాలున్నాయని జనాలకు చెప్పటమే ఉద్దేశ్యం. తమ ఆరోపణలకు సత్యనారాయణపురంలో రిజిస్టర్ అయిన అడ్రస్ ను చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఏదో ఓ అడ్రస్ ఇవ్వాలి కాబట్టి తన అత్తగారి ఇంటి అడ్రస్ ను చూపించాడు సుధాకర్. అడ్రస్ అయితే చూపించాడు కానీ ఇక్కడ కార్యకలాపాలేవీ జరగటం లేదన్నది వాస్తవం. వాస్తవం ఇలాగున్నా ఇదేమీ టీడీపీ పట్టించుకోకుండా టీడీపీ మాత్రం జగన్ పై బురదచల్లేస్తోంది.
ఇంకా విచిత్రం ఏమిటంటే పట్టుబడిన హెరాయిన్ విలువ రు. 9 వేల కోట్లని కస్టమ్స్ ఉన్నతాధికారులే ప్రకటిస్తే టీడీపీ నేతలు మాత్రం పట్టుబడిన హెరాయిన్ రు. 72 వేల కోట్లని చెప్పటం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కంపెనీ రిజిస్ట్రేషన్ విజయవాడలో జరిగింది కాబట్టి సదరు హెరాయిన్ వ్యాపారంతో జగన్ కు సంబంధాలున్నాయన్న టీడీపీ లాజిక్కే పరమచెత్తగా ఉంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం జరుగుతోంది కాబట్టి దీంతో కూడా జగన్ కు సంబంధాలున్నాయని చెప్పేస్తున్నారు. అసలు హెరాయిన్ను పట్టుకున్నది గుజరాత్ లో కాబట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సంబంధాలున్నాయని చెప్పటానికి మాత్రం టీడీపీ ధైర్యం చేయటంలేదు.
టీడీపీ చెప్పిందే నిజమైతే ఇదే గంజాయివ్యాపారంతో చంద్రబాబునాయుడుకు కూడా సంబంధాలున్నట్లు అంగీకరించాలి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోని అడవుల్లో దశాబ్దాలుగా గంజాయి వ్యాపారం జరుగుతోంది. ఏవోబీ ప్రాంతంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలోని అడవుల్లో గంజాయి సాగు యధేచ్చగా జరుగుతోందని అందరికీ తెలిసిందే. మరి గంజాయి వ్యాపారంతో చంద్రబాబుకు కూడా సంబంధాలున్నాయని టీడీపీ అంగీకరిస్తుందా ? మొత్తంమీద బోడిగుండుకు మోకాలికి ముడేయటంలో చంద్రబాబు అండ్ కో కు మించిన వారు లేరు. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రభావం చంద్రబాబుపై బాగానే పడినట్లు అర్ధమైపోతోంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరిపై ఏమి మాట్లాడుతున్నారో కూడా చూసుకోవటంలేదు.