Begin typing your search above and press return to search.

సైకో పాలన వద్దు...సైకిల్ పాలన ముద్దు.. వాటే టైమింగ్ బాస్

By:  Tupaki Desk   |   8 Dec 2022 11:00 PM IST
సైకో పాలన వద్దు...సైకిల్ పాలన ముద్దు.. వాటే టైమింగ్ బాస్
X
చంద్రబాబు ఇపుడు పూర్తిగా తన భాష మార్చేశారు. నిజానికి బాబు స్పీచులు అంటే రొటీన్ గా రొడ్డకొట్టుడుగా సాగుతాయి. గంటల తరబడి ఆయన అలా చెప్పుకుంటూ పోతారు. తన స్పీచ్ కి జనాలు ఎంతవరకూ కనెక్ట్ అవుతున్నారు అన్నది ఆయన గమనంలోకి తీసుకోరు అని విమర్శలు ఉన్నాయి.

అయితే ఈ మధ్య బాబు స్టైల్ ఫుల్ గా మార్చేశారు. తన పొలిటికల్ టెర్మినలాజీనే చేంజ్ చేశారు. ఆయన జగన్ మీద కామెంట్స్ చేయడం అంటే నల్లేరు మీద బండిలా దూకుతున్నారు. జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీయడమే కాదు టీడీపీ అంటే ఏమనుకుంటున్నావ్ అంటూ బిగ్ సౌండ్ చేస్తున్నారు.

ఏపీలో జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి బాబు అనేక ఉపమానాలు వాడుతున్నారు. అవన్నీ జనాల్లో కనెక్ట్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఈ జగన్ రెడ్డి ఒక శనిలా రాష్ట్రానికి పట్టాడు అంటూ గోదావరి జిల్లాల టూర్ లో బాబు పదే పదే కామెంట్స్ చేశారు. జగన్ కంటే కరోనా వైరస్ వేరే ఉంటుందా అని మరో సందర్భంలో బాబు విమర్శలు చేశారు.

ఒక్క చాన్స్ అంటే జాలి పడి ఇచ్చాం ఇపుడు చచ్చాం అంటూ జనాంతికంగా పంచులేస్తున్నారు బాబు. పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడు, ఇపుడు గుద్దుడే గుద్దుడు అంటూ అన్నీ పెంచేశారు. అవునా కాదా అని జనానే అడుగుతున్నారు. జగన్ రెడ్డికి పాలన అంటే బటన్ నొక్కడం తప్ప మరేమైనా తెలుసా అంటూ ఇంకో సందర్భంలో బాబు గట్టిగా వేసుకున్నారు.

లేటెస్ట్ గా గుంటూరు టూర్ లో మరో పంచ్ వేశారు. ఏపీలో సైకో పాలన సాగుతోంది. ఈ పాలనను లేకుండా చేయాలి. కాకుండా చేయాలి. సైకో పాలన వద్దు సైకిల్ పాలన వద్దు అని అంతా గట్టిగా చెప్పాలి అని బాబు మంచి టైమింగ్ తో చెప్పిన డైలాగులు బాగా పేలాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ ధూళిపాళ నరేంద్ర చౌదరితో కలసి ఆయన మీటింగ్ పెట్టారు.

చక్కగా నరేంద్ర చౌదరి తన డైరీ వ్యాపారం చేసుకుంటూంటే ఆయన సంగం డైరీని మూయించేందుకు జగన్ ప్రయత్నం చేశారని బాబు విరుచుకుపడ్డారు. కేసులు పెట్టి వేధించారని అన్నారు. సంగం డైరీ వద్దుట. గుజరాత్ కి చెందిన అమూల్ డైరీ కావాలట. జగన్ ఒక పెద్ద అమూల్ బేబీ అంటూ మరో పంచ్ వేసేశారు బాబు. అంటే ఆయనకు ఏమీ తెలియదు అని చెప్పడానికన్న మాట.

బీసీల మీద ఇపుడే ప్రేమ కలిగిందా జగనూ నాలుగేళ్ళు ఏమి చేస్తున్నావ్. ఇంతకీ నీవు చేసినదేంటో వారికి. బీసీలు అంటే టీడీపీకి బ్యాక్ బోన్ అది గుర్తు పెట్టుకో అంటూ బాబు పేల్చిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జగన్ తన వెనక నలుగురు ఉన్నారని అన్నారు. ఇది కచ్చితంగా నిజమే. ఆయన వెనక ఉన్నది విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతే కదా అంటూ మరో పంచు వేశారు. అలా వైసీపీ బీసీల పార్టీ కాదని, జగన్ గుండెల్లో ఉన్నది బీసీలు కాదని బాబు తేల్చేశారు అన్న మాట.

నీకు ఆ నలుగురే మాకు మొత్తం అంతా ఉన్నారు అంటూ టీడీపీ సామాజిక న్యాయం చేసే పార్టీగా బాబు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు తన ప్రసంగాలలో పూర్తిగా నావల్టీని చూపిస్తున్నారు. సుదీర్ఘమైన స్పీచులు కాకుండా మధ్య మధ్యలో పంచులేస్తూ గోల చేస్తూ జోక్స్ పేలుస్తూ ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి పేర్లు అక్కడ స్థానిక సమస్యలు చెబుతూ పూర్తిగా తన ప్రసంగాలను జనాల మీదకు వదులుతున్నారు. దాంతో బాబు సభలకు వచ్చిన వారు బాగా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. మొత్తానికి జగన్ని ఎక్కడా వదలకుండా బాబు విమర్శలు చేస్తున్నా ఏ రోజుకు ఆ రోజు అవి కొత్తగా ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.