Begin typing your search above and press return to search.
బాబుకు పదహారేళ్లు జైలు తప్పదా?
By: Tupaki Desk | 10 Nov 2019 1:16 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబును గుక్క తిప్పుకోకుండా తిట్టేసే రాజకీయనేతల్లో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బాబు స్థాయికి తగ్గట్లు హుందాగా వ్యవహరిస్తే బాగుండేదన్నారు.
తన చిత్తూరు పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ అవినీతిపరుడని.. పదహారు నెలలు జైల్లో ఉన్నారంటూ వ్యాఖ్యానించటం సరికాదన్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు తాము రౌడీయిజం చేసే వాళ్లమే అయితే.. రాష్ట్ర ప్రజలు తమను ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టి ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎవరు చనిపోయినా ఇసుక కొరత కారణంగా చనిపోయినట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. బాబు చేసిన అవినీతి పనులు వెలికి తీస్తే ఆయనకు ఏకంగా పదహారు సంవత్సరాలు జైల్లో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే జరిగితే ఆయన్ను ఆ దేవుడే కాపాడాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాటలు చూస్తుంటే.. బాబు ఘనకార్యాల మీద ప్రభుత్వం ఒక కన్నేసిందా? అన్న సందేహం కలుగక మానదు.