Begin typing your search above and press return to search.
రాహుల్ కు నిరసనలతో షాకిచ్చిన చంద్ర దండు
By: Tupaki Desk | 24 July 2015 10:01 AM ISTఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని పరామర్శించేందుకు అనంతపురం జిల్లాకు చేరుకున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం ఎదురైంది. ఒక పక్క కాంగ్రెస్ నేతలు హర్షాతిరేకాలు భారీగా సాగుతున్న సమయంలోనే.. చంద్ర దండు పేరిట కొందరు ఆందోళన కారులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. రాహుల్ గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు.
రాహుల్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్ర దండు పేరిట ఆందోళన ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. పోలీసుల కళ్లుగప్పి.. భద్రతా వర్గాలకు ఝులక్ ఇస్తూ.. చంద్రదండు చేసిన నిరసన విస్మయానికి గురి చేయటంత పాటు.. కాంగ్రెస్ వర్గీయులకు షాక్ ఇచ్చేలా చేసింది. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న చంద్రదండు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ చంద్రదండు ఎవరు? వారి అజెండా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.