Begin typing your search above and press return to search.

ఫోన్ లైన్ లో చిరంజీవి సేవ‌ల్ని కొనియాడిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   22 Aug 2021 5:00 PM IST
ఫోన్ లైన్ లో చిరంజీవి సేవ‌ల్ని కొనియాడిన చంద్ర‌బాబు
X
నేడు (ఆగ‌స్టు 22న‌) పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి బెస్ట్ విషెస్ వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖుల్లో మ‌హేష్‌.. వెంక‌టేష్.. ప్ర‌భాస్.. ఎన్టీఆర్ త‌దిత‌రులు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియ‌జేసిన‌ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కి మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసారు.

చంద్రబాబు నాయుడు స్వ‌యంగా ఫోన్ లో చిరంజీవికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ``ఈ క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో మీరు చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాలు ఎంతో బావున్నాయి. స‌మాజానికి అలాగే ప‌రిశ్ర‌మ‌లో సినీకార్మికుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మీరు చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాలు గ‌మ‌నిస్తున్నాను. చాలా మంచి కార్య‌క్ర‌మాలు చేస్తూ సేవాధృక్ప‌థంతో ఉన్న మీకు నా శుభాభినంద‌న‌లు`` అని తెలిపారు.

``సినీప‌రిశ్ర‌మ‌లోనూ గ‌త వైభ‌వాన్ని గుర్తు తెచ్చేలా మీరు రాణిస్తున్న విధానం... ఎంతో ఇష్టంతో క‌ష్ట‌ప‌డుతున్న సినిమాల్లో రాణించాల‌ని మీ లెగ‌సీ ఇలాగే కొన‌సాగాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుతున్నాను`` అని చిరంజీవి న‌ట‌నారంగంలో కృషిపైనా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని కృతజ్ఞత‌లు తెలియచేసారు. చిరుకి ఫోన్ లైన్ లో చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసార‌ని తెలుస్తోంది.