Begin typing your search above and press return to search.
ఆ విషయంలో రామ్ కి మద్దతుగా నిలిచిన చంద్రబాబు !
By: Tupaki Desk | 17 Aug 2020 6:20 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీ యంగ్ హీరో రామ్ విషయంలో విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అంటూ చెప్పుకొచ్చారు. ఏదైనా ఒక సమస్య గురించి ట్వీట్ చేస్తే, దాన్ని విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని తిరిగి ఏసీపీ బెదిరించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో నిదర్శనం అని తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని , మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యం లో శ్రేయస్కరం కాదు అని తెలిపారు.
అసలు విషయం ఏమిటంటే ..విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన పై తెలుగు హీరో రామ్ పోతినేని స్పందించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ పై కుట్ర జరుగుతోందంటూ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద కొన్ని ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు రాజకీయంగానూ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో రామ్ ట్వీట్లపై నగర ఏసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉండగా , విచారణకు అడ్డుపడకూడదని.. లేని పక్షంలో నోటీసులు అందుకోవలసి ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు. ఏసీపీ హెచ్చరికలతో .. రామ్ తనకు న్యాయంపై నమ్మకం ఉందని, కుట్రదారులకు తప్పక శిక్షపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ఇకపై తాను ఈ విషయంలో ఎలాంటి ట్వీట్లు చేయను అని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.