Begin typing your search above and press return to search.

న‌వ్విపోదురు గాక‌!... బాబు నోట ఆ మాట‌!

By:  Tupaki Desk   |   20 Jan 2019 10:37 AM GMT
న‌వ్విపోదురు గాక‌!... బాబు నోట ఆ మాట‌!
X
న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు. ఇది మ‌న పెద్దలు చెప్పిన చాలా ముత‌క సామెత‌. ఇత‌ర రంగాల విష‌యం అలా ప‌క్క‌న‌పెడితే... రాజ‌కీయ రంగంలో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఈ సామెత‌కు అతికిన‌ట్టుగా స‌రిపోతున్నాయి. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు చూడాలంటే మ‌నం ఎక్క‌డికో పోవాల్సిన ప‌ని లేదు. ఇక్క‌డే... మ‌న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లోనే మ‌న క‌ళ్ల‌కు క‌ట్టేలా ఈ చిత్రాన్ని నిలిపింది మ‌రెవ‌రో కాదు. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడే. గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరిట చంద్ర‌బాబు... ఏపీలో త‌న‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన బ‌ల‌మైన విప‌క్షం వైసీపీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపి... విడ‌త‌ల‌వారీగా ఏకంగా వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 23 మందిని త‌న పార్టీలో చేర్చుకున్నారు. ముగ్గురు ఎంపీల‌ను సైతం త‌న వైపున‌కు తిప్పేసుకున్నారు.

ఈ ఆప‌రేష‌న్ కు చంద్ర‌బాబు బాగానే ఖ‌ర్చుపెట్టిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు, ఇత‌ర‌త్రా కాంట్రాక్టులు, నియోజ‌వ‌కర్గ అభివృద్ధి, పార్టీలో మ‌రింత ప్రాధాన్యం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు త‌దిత‌ర బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన బాబు... నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో హార్స్ ట్రేడింగ్‌కు స‌రికొత్త అర్థం చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే... అస‌లు తాను చేసింది మంచేన‌ని, ఇత‌రులు దానిని చేస్తేనే త‌ప్పంటూ చంద్ర‌బాబు చేసే వితండ వాద‌న ఒక‌టుందిగా. ఆ వాద‌న‌ను చూస్తేనే ఇప్పుడు న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే సామెత గుర్తుకు వ‌స్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో స‌త్తా చాటుతూ.... ప్ర‌ధాని మోదీని గ‌ద్దె దించుతానంటూ బీరాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబు... కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని యూపీఏలో చేరిపోయారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక‌... తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించిన భారీ ర్యాలీకి త‌న ప్ర‌తినిధుల‌ను పంపింది.

అయితే ఈ ర్యాలీకి స్పెష‌ల్ ఫ్లైటేసుకుని వెళ్లిన చంద్ర‌బాబు... అక్క‌డ మైకంద‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్లుగా త‌న‌దైన శైలి ఆవేద‌న‌ను, ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కారు. క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు... అక్క‌డ కాంగ్రెస్‌, జేడీఎస్ కూట‌మిలోని ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేత‌లు కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంత‌టితో ఆగ‌ని చంద్ర‌బాబు... అక్క‌డ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టుగా కొనేసేందుకు బీజేపీ య‌త్నిస్తోంద‌ని, ఇందుకు పెద్ద ఎత్తున డ‌బ్బును వెద‌జ‌ల్లుతోంద‌ని కూడా బాబు ఫైరైపోయారు. మ‌రి ఏపీలో తాను వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఎలా కొన్నాన‌న్న విష‌యం ఈ ప్ర‌జ‌ల‌కు... కోల్ క‌తా వేదిక‌పై కూర్చున్న నేత‌ల‌కు ఏం తెలుసులే అనుకున్నారో, ఏమో తెలివ‌య‌దు గానీ... పార్టీ ఫిరాయింపుల‌పై చంద్ర‌బాబు చాలా ఆవేద‌నా భ‌రిత ప్ర‌సంగం చేశారు.