Begin typing your search above and press return to search.

పవన్ కోసం త్యాగాలు చేయండి... చంద్రబాబు

By:  Tupaki Desk   |   5 Feb 2019 12:22 PM IST
పవన్ కోసం త్యాగాలు చేయండి... చంద్రబాబు
X
“ మనం ఇబ్బందుల్లో ఉన్నాం. గత ఎన్నికల్లో లాగే ఎన్నికల్లో కూడా మనకి వంటరిగా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఈసారి కూడా మనం పవన్ కళ్యాణ్ స్నేహం తీసుకోవాలి. గతంలో భారతీయ జనతాపార్టీ కూడా మనకు సహకరించింది. ఆ ఇద్దరి వల్ల అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు పవన్ తో జాగ్రత్తగా ఉండాలి. ఆయన కోసం కొన్ని స్థానాలలో త్యాగం చేయాలి” ఈ మాటలు అన్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పార్టీ సీనియర్ నాయకులు తోను, మంత్రులతోనూ సమావేశమవుతున్న చంద్రబాబు నాయుడు పదే పదే పవన్ కళ్యాణ్ కు సహకరించాలంటూ సూచనలు చేస్తున్నారు అంటున్నారు.

ఎన్నికలకు ముందు కళ్యాణ్ తో పొత్తు లేకపోయినా ఎన్నికల అనంతరం వచ్చిన స్థానాలను బట్టి పవన్ కళ్యాణ్ తో స్నేహం ఉంటుందని, ఆయనతో కలిసి అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులు, మంత్రులకు చెబుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని స్థానాలలో తమకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారని, ఆస్థానాలలో మనం సహకరిస్తే మిగిలిన చోట్ల ఆయన మనకు సహకరిస్తారని చంద్రబాబు నాయుడు అన్నట్టు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలో కొన్ని స్థానాల్లోనూ, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో జనసేనకు సహకరించాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. అలాగే విజయనగరం, ఒంగోలు, కర్నూలు కడప జిల్లాల్లో జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విజయం కోసం సహకరిస్తారని, ఇది లోపాయికారీగా జరుగుతుందని చంద్రబాబు నాయుడు అన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే పవన్ పై విమర్శల దాడిని తగ్గించాలంటూ తెలుగు తమ్ముళ్లకు సూచించిన చంద్రబాబు నాయుడు ముందు ముందు అనేక త్యాగాలకు కూడా సన్నద్ధం కావాలంటే పిలుపు ఇవ్వడం అటు తెలుగుదేశం పార్టీలోను చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాస‌న‌స‌భ స్ధానాల‌తో పాటు కొన్ని లోక్ స‌భ స్ధానాల్లో కూడా తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ విజ‌యం సాధించే దిశ‌గా వెళ్లాల‌ని చ్రంద‌బాబు నాయుడు తెలుగు త‌మ్ముళ్ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లు చెబుతున్నారు.