Begin typing your search above and press return to search.

జగన్‌ నిర్ణయానికి జై కొట్టిన బాబు స్వగ్రామం

By:  Tupaki Desk   |   13 Feb 2020 8:45 AM GMT
జగన్‌ నిర్ణయానికి జై కొట్టిన బాబు స్వగ్రామం
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. పేద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాలనే పట్టుదలతో జగన్‌ ఆ నిర్ణయం అమలుచేశారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. మాతృభాషకు ప్రమాదమని, ఆంగ్ల మాధ్యమంతో తెలుగు భాష అంతరించిపోతుందని ఆందోళనలు చెలరేగాయి. అయినా వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకువెళ్తున్నారు. రాజకీయ పరంగా ఆ నిర్ణయం పై విమర్శలు వస్తున్నా ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం కూడా జై కొట్టడం విశేషం.

ఆంగ్ల మాధ్యమంపై తొలి నుంచి చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. తల్లిలాంటి తెలుగు భాషకు ఆంగ్ల మాధ్యమంతో ప్రమాదం వాటిల్లిందని, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే తెలుగు భాష అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తన మీడియా తో వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ప్రత్యక్షంగా ఆయన ఆందోళనలు చేపట్టారు. అయితే జగన్‌ తీసుకున్న నిర్ణయానికి మాత్రం ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది. తాజాగా చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు స్వగ్రామం నారా వారిపల్లి గ్రామ ప్రజలు కూడా ఆంగ్ల మాధ్యమం హర్షిస్తూ స్వాగతం పలికారు.

ఆంగ్ల మాధ్యమం విద్యకు నారావారిపల్లె గ్రామస్తులు కూడా ఆమోదం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నారావారిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సమావేశమయ్యారు. ఆంగ్ల మాధ్యమంపై చర్చించారు. అనంతరం ఆంగ్ల మాధ్యమం కావాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాల్సి ఉండగా 12 మంది హాజరయ్యారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం బోధించాలని కోరుతూ వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జగన్‌ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడి స్వగ్రామం లోనే జై కొట్టడం తో చంద్రబాబు కి ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది. ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని అన్ని గ్రామాల ప్రజలు హర్షిస్తూ స్వాగతం పలుకుతున్నారు.