Begin typing your search above and press return to search.

భీమ్లానాయక్ మూవీపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   25 Feb 2022 8:02 AM GMT
భీమ్లానాయక్ మూవీపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. షాకింగ్ కామెంట్స్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లానాయక్’ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు మంచి స్పందన వస్తోంది. విదేశాల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే భీమ్లానాయక్ మూవీ చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు కూడా వచ్చి చేరారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేష్ లు కూడా వచ్చి చేరారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ‘భీమ్లానాయక్’ చిత్రంపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ పలు రకాల నిబంధనలు విధించిందంటూ ఆరోపించారు. భీమ్లానాయక్ చిత్రంపై ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందన్న చంద్రబాబు

భీమ్లానాయక్ చిత్రాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్ చివరకు వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడని విమర్శించారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందన్నారు.

తెలుగుదేశం తప్పును ఎప్పుడు ప్రశ్నిస్తుందని.. నిలదీస్తుందన్నారు. భీమ్లానాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

భీమ్లానాయక్ కు అద్భుత స్పందన: లోకేష్

భీమ్లానాయక్ చిత్రంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయమైన ఆయన ట్వీట్ చేశారు. ‘భీమ్లానాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని.. సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నానని’ అన్నారు. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారన్నారు.

సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. భీమ్లానాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నానని వైసీపీ ప్రభుత్వాన్ని నారా లోకేష్ విమర్శించారు.