Begin typing your search above and press return to search.

నాడు కేసీఆర్.. నేడు జగన్.. చంద్రబాబు డేంజర్ గేమ్?

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:00 PM IST
నాడు కేసీఆర్.. నేడు జగన్.. చంద్రబాబు డేంజర్ గేమ్?
X
40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబుకు ఎక్కడ దొరికినా ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసని.. అందుకే 40 ఏళ్లు రాజకీయం వెలుగబెడుతున్నాడని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు.

నిజానికి చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో తెలంగాణలో ‘ఓటుకు నోటు’ కేసులో అడ్డంగా దొరికిపోవడం పెద్ద మైనస్. కానీ నాడు మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ కేసీఆర్ ను ఆత్మరక్షణలోకి నెట్టి బయటపడ్డారంటారు.

సరిగ్గా ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పైనా అదే అస్త్రాన్ని చంద్రబాబు తీశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఇప్పుడు ఏపీలో డేంజర్ గేమ్ ఆడుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారపక్షమే టార్గెట్ గా ఇందులో న్యాయవ్యవస్థను, పాత్రికేయులను కూడా లాగి వైఎస్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారని అంటున్నారు.

గతంలో ఓటుకు నోటులో ఇరుక్కున్న చంద్రబాబు ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ అసలు తమ ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేశారని నాడు చంద్రబాబు కూడా పోటీగా కేసులు పెట్టడంతో కేసీఆర్ కూడా కూడా వెనక్కి తగ్గారు. దీంతో ఆ కేసు ఇప్పటికీ తేలడం లేదు.

ఇప్పుడు మరోసారి జగన్ సర్కార్ పై అదే ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని బాబు ఎక్కుపెట్టారు. ఇందులో విశేషం ఏంటంటే.. ప్రతిపక్షాలవే కాదు.. న్యాయమూర్తులు, పాత్రికేయుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.ఈ మేరకు మోడీకి లేఖ రాశారు. దీంతో ఈ డేంజర్ గేమ్ లో వైఎస్ జగన్ సర్కార్ ఏం చేస్తుంది? ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.