Begin typing your search above and press return to search.
‘తిరుపతి’ నే రెఫరెండం కింద తీసుకోవచ్చు కదా ?
By: Tupaki Desk | 18 Dec 2020 10:08 AM IST‘మూడు రాజధానుల పై రెఫరెండం కోరటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా’ ? లేకపోతే వైసీపీ ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయిస్తే తాము కూడా తమ ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి ప్రజాతీర్పు కోరుదాం. అంటూ చంద్రబాబునాయుడు తాజాగా జగన్ కు సవాలు విసిరారు. అమరావతికి మద్దతుగా స్ధానికులు, రైతులు మొదలు పెట్టిన ఉద్యమం 365 రోజులు దాటిన సందర్భంగా రాయపూడి లో బహిరంగసభ జరిగింది. ఈ సందర్భం గా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీకి పై చాలెంజ్ విసిరారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెఫరెండం అనేది మనదేశంలో అమల్లో ఉన్న ప్రాక్టీసు కాదు. కాబట్టి రెఫరెండం కోరటం అనేది జరిగేపని కాదని చంద్రబాబుకు కూడా తెలుసు. అసలు పదే పదే రెఫరెండం అని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించేముందు రెఫరెండం ఏమన్నా కోరారా ? అధికారంలో ఉన్నామన్న ఏకైక కారణంతో ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకున్నారంతే. ఇపుడు జగన్ చేస్తున్నది కూడా ఇదే.
సరే రెఫంరెండంను పక్కన పెట్టేస్తే మూడు రాజధానులకు జనాల మద్దతుందని అనుకుంటే ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళదామని కూడా చంద్రబాబు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఇదికూడా జరిగే పనికాదని అందరికీ తెలుసు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదనుకున్నా లేకపోతే జగన్ తప్పుచేస్తున్నాడని అనుకున్నా రాజీనామా చేయాల్సింది టీడీపీ ఎంఎల్ఏలే కానీ వైసీపీ ఎంఎల్ఏలు కాదు. జగన్ ఇరుకున పెట్టడానికి ముందు తన పార్టీ ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి మళ్ళీ అందరినీ గెలిపించుకోవచ్చు కదా. వైసీపీ ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించటమన్నది చంద్రబాబు వల్లకాదు. కానీ తన పార్టీ ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించటం చంద్రబాబు కు నిముషం లో పనికదా. ముందు ఆ పని ఎందుకు చేయించటం లేదు ? చేయ గలిగిన పనిని చూడకుండా చేయలేని పని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటే మాత్రం ఉపయోగం ఏమిటి ?
సరే ఇదంతా కూడా వద్దనుకుంటే తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది. పోనీ ఆ ఉపఎన్నికనే రెఫంరెండంగా చంద్రబాబు తీసుకోవచ్చు కదా ? ఎలాగూ తిరుపతి అంటే చంద్రబాబు సొంత జిల్లానే కదా. ఉపఎ న్నికలో పార్టీని గెలిపించి తన త్తా ఏమిటో చూపిస్తే జగన్ కు అప్పుడన్నా బుద్ధొస్తుంది. లోక్ సభ నియోజక వర్గమంటే ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలన్న విషయం తెలిసిందే. ఆ ఏడు నియోజక వర్గాలనే రెఫరెండం క్రింద అనుకుంటే సరిపోతుంది. ఏమంటారు ?