Begin typing your search above and press return to search.

భారతీయులకు చాన్స్.. స్విస్ బ్యాంకులో 300 కోట్ల నల్లడబ్బు...

By:  Tupaki Desk   |   11 Nov 2019 4:40 AM GMT
భారతీయులకు చాన్స్.. స్విస్ బ్యాంకులో 300 కోట్ల నల్లడబ్బు...
X
ప్రపంచ వ్యాప్తంగా నేతలు, పారిశ్రామికవేత్తలు అక్రమంగా సంపాదించిన డబ్బునంతా స్విట్జార్యాండ్ లోని బ్యాంకుల్లో జమ చేశారు. చాలా నల్లడబ్బు స్విస్ బ్యాంకుల్లో నిక్షిప్తమైంది. అయితే అలా జమ చేసి ఇప్పటివరకూ ఖాతా వైపు తొంగిచూడని వారు ఎందరో ఉన్నారట.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండంతో ఆ సొమ్మును అలాగే వదిలేస్తున్నారట.. అలా మొత్తం 2600 ఖాతాల్లో ఎన్నాళ్లో నుంచి ఎటువంటి లావాదేవీలు లేకుండా కోట్ల సొమ్ము ఉంది.

ఆ 2600 ఖాతాల్లో 12 మంది భారతీయుల ఖాతాలు కూడా ఉన్నాయి. వారు తమ డబ్బును తీసుకోవడం లేదు. 2015 వరకు ఆ 12 మంది భారతీయుల సొమ్ము ఏకంగా 300 కోట్లకు చేరింది. ఇప్పుడు ఈ సొమ్మును సదురు వ్యక్తుల వారసులు ఆధారాలతో సహా వచ్చి తీసుకోవాలని.. లేదంటే అదంతా స్విస్ ప్రభుత్వ ఖాతాల్లోకి జమ అవుతుందని స్విట్టర్లాండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది.

భారతీయుల 12 ఖాతాల్లో రెండు ముంబై, కోల్ కతా నగరాలకు చెందిన అడ్రస్ లున్నాయి. ఇక ఒకటి డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తిది. కొన్ని ఖాతాలు మాజీ సంస్థానాధీశులవీ.. బ్రిటీష్ కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్ లో స్థిరపడిన భారతీయుల ఖాతాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిసింది.

సదురు భారతీయుల వారుసులు ఆ 300 కోట్లను ఈనెల 15వ తేదీలోగా వచ్చి ఆధారలతో వచ్చి బ్యాంకులో కలిస్తే ఆ మొత్తం అందజేస్తారు. లేదంటే స్విస్ ఖాతాల్లోకి చేరిపోతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.