Begin typing your search above and press return to search.

4జీ ఫోన్ రూ.501కే కావాలా?

By:  Tupaki Desk   |   29 Aug 2016 3:51 PM IST
4జీ ఫోన్ రూ.501కే కావాలా?
X
చౌక‌ధ‌ర మొబైల్ ఫోన్ల‌లో మ‌రో సంచ‌ల‌నం. ఇప్ప‌టికే రింగింగ్ బెల్స్ అనే కంపెనీ ఫ్రీడ‌మ్ 251 పేరిట రూ.251 ల‌కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌ ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌క్కువ‌లో త‌క్కువ‌గా 4వేల ధ‌ర ఉండే 4జీ ఫోన్ల‌ను కేవ‌లం రూ.501కే అందిస్తామ‌ని మ‌రో కంపెనీ ప్ర‌క‌టించి మార్కెట్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. చాంప్‌ వ‌న్ సీ1 పేరుతో వ‌చ్చిన ఈ ఆఫ‌ర్ ఇపుడు మార్కెట్లో హాట్ టాపిక్‌

చాంప్‌ వ‌న్ అనే సంస్థ 'చాంప్‌ వ‌న్ సీ1 (CHAMPONE C1)' పేరిట రూ.7,999 ధ‌ర క‌లిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌ ను కేవ‌లం రూ.501 కే అందిస్తామంటూ తాజాగా చేసిన‌ ప్ర‌క‌ట‌న వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిచేస్తోంది. చాంప్‌ వ‌న్ ఇండియా.కామ్ సైట్‌ లో రూ.51 చెల్లించి ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారికి సెప్టెంబ‌ర్ 2 ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఫ్లాష్ సేల్‌ లో ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. ఆ సేల్‌ లో ఫోన్‌ ను కొనుగోలు చేసిన వారు డివైస్‌ ను అందుకోగానే క్యాష్ ఆన్ డెలివ‌రీ రూపంలో రూ.501 చెల్లించాల్సి ఉంటుంద‌ని చాంప్‌ వ‌న్ త‌న వెబ్‌ సైట్‌ లో వివ‌రాల‌ను పెట్టింది. మ‌రోవైపు చాంప్‌ వ‌న్ త‌న స్మార్ట్‌ ఫోన్ చాంప్‌ వ‌న్ సీ1ను రూ.501 కే విక్ర‌యిస్తామ‌ని చెప్ప‌డం ఏమో గానీ ఆ సైట్‌లో ప్ర‌స్తుతం రిజిస్ట్రేష‌న్లు ఆగిపోయాయి. మ‌రో 24 గంట‌ల త‌రువాత ప్ర‌య‌త్నించండి అంటూ మెసేజ్ ద‌ర్శ‌న‌మిస్తోంది. ఏది ఏమైనా ఫ్లాష్ సేల్ జ‌రిగి వినియోగ‌దారుల చేతికి ఈ ఫోన్ వ‌చ్చే వ‌ర‌కు చాంప్‌ వ‌న్‌ ను న‌మ్మ‌లేమ‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ రోజు వ‌స్తే గానీ ఆ సంస్థ నిజంగా రూ.501కి ఫోన్‌ ను ఇచ్చేది, లేనిది తెలియ‌ద‌ని వారు అంటున్నారు.

చాంప్‌ వ‌న్ సీ1 ఫీచ‌ర్లు...

5 ఇంచ్ హెచ్‌ డీ డిస్‌ప్లే - 1280 X 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

1.3 జీహెచ్‌ జ‌డ్ క్వాడ్‌ కోర్ ప్రాసెస‌ర్‌ - 2 జీబీ ర్యామ్

16 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్‌ - 32 జీబీ ఎక్స్‌ పాండ‌బుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌ - డ్యుయ‌ల్ సిమ్

8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

4జీ - బ్లూటూత్ 4.0 - ఫింగ‌ర్‌ ప్రింట్ స్కాన‌ర్

2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ