Begin typing your search above and press return to search.
వెంకయ్యనాయుడి ఇంటిపేరు మారింది.
By: Tupaki Desk | 18 Sept 2016 11:38 AM ISTఎం.వెంకయ్యనాయుడు.. దేశ రాజకీయాల్లో ఈ పేరు తెలియనివారుండరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులరే.. అందులో అనుమానమే లేదు. కానీ... ఆడపిల్లలకు పెళ్లయితే ఇంటిపేరు మారినట్లుగా ఇప్పుడు వెంకయ్యకు కూడా కొత్త ఇంటిపేరు వచ్చింది. కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం.. దాని సాధనలో వెంకయ్య కీలకమయ్యారన్న ప్రచారం.. ఆయనకు అభినందన సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న నేతలు వెంకయ్యపై మండిపడుతున్నారు. అంతేకాదు.. ఆయన ఎం.వెంకయ్యనాయుడు కాదు ఎ.వెంకయ్యనాయుడని... అంటే అవాస్తవాల వెంకయ్యనాయుడని విమర్శిస్తున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో చేస్తోన్న అభినందన సభపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ తెచ్చినందుకు సన్మానాలు చేసుకోవడం ప్రత్యేక హోదాకు తూట్లు పొడవడమేనని అన్నారు. ఇటువంటి పనిచేయడం వెంకయ్యకే చెల్లిందని ఆయన అన్నారు.
వెంకయ్యనాయుడికి 'అవాస్తవాల వెంకయ్య' అని బిరుదు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ లాభం కలిగిస్తుందని వెంకయ్యనాయుడు చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.