Begin typing your search above and press return to search.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక చైనామీద ఆధారపడాల్సిన అవసరం లేదు..!

By:  Tupaki Desk   |   1 April 2021 9:00 PM IST
కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక చైనామీద ఆధారపడాల్సిన అవసరం లేదు..!
X
మొబైల్​ తయారీ కోసం మనదేశం చైనా మీద ఆధారపడాల్సి వస్తోంది. మన దేశంలో ‘చిప్​ ఫాబ్రికేషన్​ యూనిట్లు’ అధికంగా లేకపోవడంతో మొబైల్​, ఎలక్ట్రానిక్​ వస్తువుల తయారీలో చైనా నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే గత ఏడాది .. చైనాతో మనదేశానికి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. లడఖ్​ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్నది. దాదాపు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పలు చైనా యాప్​లను మనదేశం నిషేధించింది. దీంతో ఆ దేశానికి తీవ్ర ఆర్థికనష్టం వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే మొబైల్​ తయారీ, ఎలక్ట్రానిక్​ వస్తువుల విడిభాగాల తయారీ కోసం మనదేశం చైనా మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్​ కీలక నిర్ణయం తీసుకున్నది.

మనదేశంలోనే సెమీ కండక్టర్‌ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వాలని చూస్తున్నది. ఇందుకోసం ఓ భారీ ఆఫర్​ ను ప్రకటించింది.

'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా "చిప్ ఫాబ్రికేషన్ యూనిట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందించబోతున్నది. మనదేశంలో ఏర్పాటు చేసే "చిప్ ఫాబ్రికేషన్ యూనిట్ల కోసం 1 బిలియన్ డాలర్ల ( సుమారు 7వేల కోట్ల రూపాయలు) నగదు ప్రోత్సాహం ఇవ్వబోతున్నారట. ఈ మేరకు ఓ సీనియర్​ ఐఏఎస్​ అధికారి మీడియాకు తెలిపారు.

అంతేకాక ఈ కంపెనీలు తయారుచేయబోయే చిప్​ లను కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని భావిస్తున్నదట. ప్రస్తుతం మనదేశంలో చిప్​ల కొరత ఉంది. దీంతో చిప్​ లను చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మనదేశంలోనే చిప్​ లు తయారు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకోసం ప్రోత్సాహం అందించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.