Begin typing your search above and press return to search.

రెండు రోజుల పాటు ఏపీలో కేంద్ర బృందాల పర్యటన..నష్టం ఎన్ని వేల కోట్లంటే?

By:  Tupaki Desk   |   9 Nov 2020 8:04 PM IST
రెండు రోజుల పాటు ఏపీలో కేంద్ర బృందాల పర్యటన..నష్టం ఎన్ని వేల కోట్లంటే?
X
ఏపీలో ఈ రోజు, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు రెండు రోజుల పాటు వరద ప్రభావిత జిల్లాలో పర్యటించనున్నాయి. ఈరోజు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మూడు బృందాలు పర్యటించనున్నట్లు తెలపారు. అలాగే రేపు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు బృందాలు పర్యటించనున్నట్లు కె.కన్నబాబు వెల్లడించారు. ఇక సోమవారం ఉదయం కేంద్ర బృందాలు సీఎస్ నీలం సాహ్నీతో సమావేశం అయ్యింది. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారు.. అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ ‌లో బయల్దేరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మొత్తం రూ.6386.67 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ అంచనా వేసింది.

ఇందులో ఆర్ అండ్ బీకి సుమారు రూ.2,977 కోట్లు.. వ్యవసాయానికి రూ.804 కోట్లు.. ఉద్యాన పంటలకు రూ.483కోట్లు.. పంచాయతీ రాజ్ విభాగానికి రూ.782 కోట్లు.. మున్సిపల్ పరిపాలనా శాఖకు రూ.75 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రభుత్వం కేంద్ర బృందాన్ని రూ.6,386.67 కోట్ల సాయం కోరింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టంపై నివేదిక ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.840 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. 3 గంటలకు కంచికచర్ల మండలం గని ఆత్కూరు, చెవిటికల్లు గ్రామాల్లో పర్యటించనుంది. సాయంత్రం 4 గంటలకు చందర్లపాడు మండలంలో పత్తి, మిరప పంటలు పరిశీలించనున్నారు. సాయంత్రం 5:15కు విజయవాడలో అధికారులతో బృందం సభ్యులు సమావేశం కానున్నారు. నెల రోజుల క్రితం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది.