Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పై ఇక కేంద్రం పన్ను
By: Tupaki Desk | 31 Dec 2021 11:30 AM GMTసామాన్యుడి జేబుకు మరో చిల్లు పెట్టేసింది కేంద్రం. ఇప్పటికే కాదేదీ పన్నుకు అనర్హం అన్నట్టుగా అన్నింటిపై పన్నులు వేసి సామాన్యుడి పన్ను పీకేస్తున్న కేంద్రం ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీని కూడా వదల్లేదు. వాటిపై కూడా పన్నులు వేసేసింది.
ఎవరికి ఇంట్లో వంటలు చేసుకునే తీరికలేదు. అంతా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ దీని ద్వారా భారీగా ఆర్జిస్తున్నాయి. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా భోజనాన్ని అందిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి.అయితే తాజాగా కేంద్రం షాకిచ్చింది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ లపై పన్ను వేసింది. ఇకపై నేరుగా కస్టమర్ నుంచే 5శాతం జీఎస్టీని వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
జనవరి 1 నుంచి ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు భారం కానున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీన్ని తోసిపుచ్చుతున్నారు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు గతంలో రెస్టారెంట్లు 5శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి.
స్విగ్గీ, జొమాటలో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు కేంద్రం గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్ లకే అప్ప జెప్పాలని .. డెలివరీలపై 5శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.