Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పంపిణీ పై కేంద్రం సంచలన నిర్ణయం.. తొలి దశలో కోటి మందికి..!
By: Tupaki Desk | 25 Nov 2020 9:30 AM ISTప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు విజయవంతమవుతున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకొన్నాయి. మూడోదశ ట్రయల్స్ పూర్తైన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. ఇంకో రెండు మూడు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్రప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై సమాలోచనలు చేస్తున్నది. ముందుగా ఆరోగ్యకార్యకర్తలకు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కేంద్రప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 92 శాతం ప్రభుత్వ ఆస్పత్రులు, 55 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరించారు. అయితే తొలిదశలో కోటిమంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. వ్యాక్సిన్ పంపిణీకి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలకు తగిన జాగ్రత్తలు ఇవ్వాలని కూడా కోరారు.
దేశ ప్రజలందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందనికూడా ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో కూడా కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ చేస్తే పంపిణీ చేయడంపై తగిన సన్నాహాలు చేస్తున్నారు.