Begin typing your search above and press return to search.

జలవివాదాలపై స్పందించిన జలశక్తి మంత్రి

By:  Tupaki Desk   |   14 July 2021 2:28 AM GMT
జలవివాదాలపై స్పందించిన జలశక్తి మంత్రి
X
దేశంలోని నీటి పంపకాల విషయంలో లొల్లిలు షూరూ అయ్యాయి. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక-తమిళనాడు మధ్య కూడా ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి వివాదం రాజుకోగా.. తమిళనాడు-కర్ణాటక మధ్య 'మేకదాటు ప్రాజెక్టు' విషయంలో రెండు రాష్ట్రాలు లొల్లిలు పెట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే కేంద్రం తరుఫున జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కర్ణాటకలో బీజేపీ అధికారం ఉందని.. తమిళనాడులో లేదని తేడా ఏమీ చూపించమని.. నీటి పంపకాల విషయంలో మా పని మేము చేస్తామన్నారు.మా మీద ఎవ్వరు ఒత్తిడి చేసినా మేము ఏ మాత్రం పట్టించుకోమని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ తేల్చిచెప్పారు.

ఇటీవల తమిళనాడు సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం 'మేకదాటు' తాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి రెడీ అయ్యింది. దీన్ని తమిళనాడు అడ్డుకుంటోంది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కావేరి నీటి పంపిణీలో దశాబ్దాలకాలంలో తమిళనాడు-కర్ణాటక ప్రభుత్వాల మధ్య వివాదం ఉంది. ఇప్పుడు మేకదాటు ప్రాజెక్టు నిర్మిస్తే కావేరి నీటి పంపిణీ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది.అయితే బెంగళూరు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలంటే మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది.

ఈ క్రమంలోనే బెంగళూరు వచ్చిన జలవనరులశాఖ మంత్రి షెకావత్ కర్ణాటక సీఎం యడ్యూరప్పతో భేటి అయ్యారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం, కావేరి జలాల పంపకాల విషయంలో మా పని మేం చేస్తామని.. మా మీద ఎవ్వరి ఒత్తిడి చేసినా మేం పట్టించుకోమని కేంద్రమంత్రి గజేంద్ర షేకావత్ తేల్చిచెప్పారు. కర్ణాటక-తమిళనాడుకు న్యాయం చేస్తామని.. నీటి బొట్టు విషయంలో తేడా మాత్రం రాదని.. ఎవరి వాటాలు వాళ్లకు వచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఓవైపు ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో పక్క రాష్ట్రాలు కూడా నీటి పంపకాల కోసం గొడవకు దిగడంతో కేంద్రం అలెర్ట్ అయ్యింది. కేంద్రమంత్రి స్వయంగా వచ్చి ఈ వివాదాలు పరిష్కరించే పనిలో పడ్డారు.