Begin typing your search above and press return to search.

పీపీఏలపై కేంద్రమంత్రి సంచలన కామెంట్

By:  Tupaki Desk   |   28 Feb 2020 11:27 AM IST
పీపీఏలపై కేంద్రమంత్రి సంచలన కామెంట్
X
ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నాడు.. అందులో కమీషన్లు తీసుకున్నాడని వైసీపీ ఆరోపణలు చేసింది బాబు బ్యాచ్ కు భారీగానే అమ్యామ్మాలు అందాయంది.. అయితే చంద్రబాబు సీఎంగా దిగిపోయినా ఇంకా ఆ అక్రమాలు సాగాల్సిందేనా? ప్రభుత్వ ఖజానాకు బొక్క పడాల్సిందేనా? నో వే.. అందుకే వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక.. జగన్ సీఎం అయ్యాక.. చంద్రబాబు అనైతికంగా అధిక రేట్లకు చేసుకున్న ‘పీపీఏ’ ఒప్పందాలను రద్దు చేశారు. రాష్ట్రానికి వాటిల్లుతున్న వేల కోట్ల నష్టాలను నివారించాడు.

అయితే ఏపీ కోణంలో, రాష్ట్రా ప్రయోజనాల కోసం సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్. అయితే బాబుకు సాగిలపడి ఏపీతో పీపీఏలు కుదుర్చుకున్న కంపెనీలకు మాత్రం నష్టం. అందుకే ఈ విషయంలో కేంద్రం కూడా అవినీతి జరిగిందని తెలిసినా జగన్ పీపీఏల రద్దును వ్యతిరేకించింది.

తాజాగా ఏపీ ప్రభుత్వం పీపీఏలపై పునసమీక్షించడాన్ని అంతర్జాతీయ వేదిక పై సైతం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ పేరు ఎత్తుకుండా ఓ దక్షిణాది రాష్ట్రం పీపీఏలను పునసమీక్షించడం వల్ల అంతర్జాతీయంగా కంపెనీలు రాకుండా పోతాయని, దేశం పరువు పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఈ మేరకు కేంద్రమంత్రి ఇలా ప్రభుత్వాలు మారాక పీపీఏల రద్దు చేయకుండా చట్టం తెస్తామని తెలిపారు.

ప్రభుత్వాలు, నాయకులు మారినా కాంట్రాక్టులు కానీ, నిబంధనలు, పీపీఏలు మారకుండా ఉండేలా కేంద్రం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.రాష్ట్రాలు రద్దు చేస్తే వారికిచ్చే నిధులు ఆపివేసేలా నిబంధనను పెడుతామని కేంద్రమంత్రి తెలిపారు.