Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డి తో మిషన్ బీజేపీ...?
By: Tupaki Desk | 21 March 2022 9:00 AM ISTతెలుగు రాష్ట్రాలకు తిప్పి తిప్పి చూస్తే జి కిషన్ రెడ్డి ఒక్కరే చుక్కానిలా కనిపిస్తున్నారు. ఆయనది బీజేపీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుబంధం. బీజేపీకి ఉమ్మడి ఏపీ ప్రెసిడెంట్ గా చేశారు. ఆరెస్సెస్ నుంచి వచ్చిన నేత. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన తరువాత ఆయన ఇన్నాళ్ళకు మోడీ నాయకత్వాన సర్కార్ లో క్యాబినేట్ మంత్రి అయ్యారు.
అయితే కిషన్ రెడ్డిది దూకుడు రాజకీయం కాదు, మృదు స్వభావి. ఆయన మాటలు కూడా జోరు చేసేలా ఉండవు. ఆలోచింపచేస్తాయి. అయితే కిషన్ రెడ్డి మీద ఇపుడు కాషాయం పార్టీ అతి పెద్ద బరువుని పెట్టింది. అటు తెలంగాణాలో బీజేపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడం తక్షణ కర్తవ్యం అయితే ఏపీలో కూడా వీలైతే పవర్ కి దగ్గరగానూ కాకుంటే రెండవ స్థానంలో తీసుకురావాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కందాలపైన బీజేపీ పెద్దలు పెట్టారు.
దాంతో కిషన్ రెడ్డి మీద వత్తిడి పెరిగిపోతోంది. ఆయన అటు తెలంగాణాలో ఇటు ఏపీలో కూడా టూర్లు వేయాల్సి వస్తోంది. ఆయనకు బీజేపీ మాజీ ప్రెసిడెంట్ గా ఏపీ పార్టీకి, ఏపీ జనాలకు తెలియడం ప్లస్ పాయింట్ అయితే ఏపీలో బీజేపీ ఇంకా సరైన శక్తి సంతరించుకోకపోవడం మైనస్ గా ఉంది.
ఇక బీజేపీ నాయకుల మాటలు లేస్తే మనిషిని కానట్లుగా ఉంటాయి. ఇక ఏపీ బీజేపీలో తెలుగుదేశం నుంచి వెళ్ళిన వారిది ఒక లైన్, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిది మరో లైన్ గా ఉంది. కొందరు వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఉన్న వారిలో భిన్న స్వరాలు ఉండడంతో కిషన్ రెడ్డి ఏపీకి వచ్చి ఎంతలా వచ్చి బిగ్ సౌండ్ చేసినా అక్కడితోనే ఆ వేడి చల్లారిపోతోంది.
ఇక ఏపీ బీజేపీని జనసేనను కలిపి ఉంచేలా కార్యక్రమాలను కూడా ఇప్పటిదాకా చేపట్టకపోవడం ఒక వైఫల్యంగానే చూస్తున్నారు. ఈ నేపధ్యంలో తనకు అప్పగించిన మంత్రిత్వ బాధ్యతలను ఒక వైపు చూసుకుంటూ మరో వైపు తెలంగాణా ఏపీలో పార్టీని నడిపించడం కిషన్ రెడ్డికి కత్తి మీద సాము లాగే ఉంది అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ మిషన్ ని కిషన్ ఎంత మేరకు సక్సెస్ చేస్తారు అన్నది చూడాలి.