Begin typing your search above and press return to search.

మీ ఆఫీసును.. ఆసుపత్రి చేయండిః కేంద్రం లేఖ‌

By:  Tupaki Desk   |   23 April 2021 3:30 PM GMT
మీ ఆఫీసును.. ఆసుపత్రి చేయండిః కేంద్రం లేఖ‌
X
గ‌డిచిన 24 గంటల్లో దేశంలో న‌మోదైన కేసుల సంఖ్య 3 ల‌క్ష‌ల 33 వేల చిల్ల‌ర‌! నిన్న, మొన్న‌టి రోజున కూడా ఇదే ప‌రిస్థితి. ఇలా నిత్యం 3 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అవుతుండ‌డంతో.. రోగుల‌కు ఎక్క‌డ చికిత్స అందించాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దేశంలోని ఆసుప‌త్రుల‌న్నీ ఎప్పుడో నిండిపోయాయి. ఎవ‌రైనా బెడ్ కావాల‌ని అడిగితే.. ఆల్రెడీ ఉన్న‌వారు ఇంటికిపోతేనో.. శ్మ‌శానానికి పోతేనో ఇస్తామ‌ని చెబుతున్నాయి ఆసుప‌త్రులు!

దీన్ని బ‌ట్టి దేశంలో ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి దుస్థితిలో చాలా మంది ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నారు. అటు ఆసుప‌త్రుల్లో ఉన్న‌వారికి కూడా ఆక్సీజ‌న్ అంద‌క‌, రెమ్ డెసివ‌ర్ వంటి టీకాలు దొర‌క్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ప్ర‌జ‌ల‌కు వైద్య స‌దుపాయాలు పెంచేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చాలా కార్పొరేట్ కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ప‌ద్ధ‌తిలోనే ప‌నులు కొన‌సాగిస్తున్నాయి. సిబ్బంది ఇంటి నుంచే ప‌నులు చేసుకుంటూ ఉండ‌డంతో.. కార్యాల‌యాలు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో.. వాటిని ఆసుప‌త్రులుగా మార్చాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు ప‌లు కార్పొరేట్ కంపెనీల‌కు లేఖ‌లు రాస్తోంది.

దేశంలోని టాప్ వెయ్యి కార్పొరేట్ కంపెనీల‌ను లిస్ట్ ఔట్ చేసిన కేంద్ర కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ‌.. వాటి చైర్మ‌న్ల‌కు లేఖ‌లు రాస్తోంది. ఖాళీగా ఉన్న బిల్డింగుల‌ను తాత్కాలిక కొవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది. మ‌రి, వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? కేంద్రం విన్నపానికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.