Begin typing your search above and press return to search.

లోన్స్ తీసుకున్న వారికి కేంద్రం శుభవార్త

By:  Tupaki Desk   |   23 Oct 2020 1:40 PM IST
లోన్స్ తీసుకున్న వారికి కేంద్రం శుభవార్త
X
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం విధించింది. రుణాల వాయిదాలపై తాత్కాలికంగా బ్రేక్ విధించింది. అయితే ఈ వెసులుబాటు ఉపయోగించుకున్నవారి రుణాల ఈఎమ్ ఐ లపై వడ్డీకు వడ్డీ చెల్లించాల్సిరావడంతో..సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు లోన్ మొరటోరియం వెసులుబాటు వినియోగించుకున్నవారికి ఉపశమనం కల్పించింది. తాత్కాలిక నిషేధాన్ని వినియోగించుకునే ప్రజలు 2020 నవంబర్ 15 వరకు వడ్డీపై వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. నవంబర్ 15 వరకు ఎటువంటి రుణ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటించలేమని చెప్పింది. వడ్డీ మినహాయింపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దీనితో వడ్డీపై వడ్డీని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం కరోనా లాక్ డౌన్ సమయమైన ఆరునెలల కాలంలో వడ్డీ పై వడ్డీ మాఫీ చేసే నిర్ణయం పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్‌, హోమ్‌ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. సుప్రీం నవంబర్ 2 వరకే గడువు ఇవ్వడంతో కేంద్రం తాజాగా దీనిపై చర్యలు మొదలుపెట్టింది అని తెలుస్తుంది.