Begin typing your search above and press return to search.

తమిళులది పండగ... ఆంధ్రులది జూదమా?

By:  Tupaki Desk   |   8 Jan 2016 11:47 AM GMT
తమిళులది పండగ... ఆంధ్రులది జూదమా?
X
తమిళనాడులో సంక్రాంతికి జల్లికట్టు ఎంత పాపులరో ఏపీలో కోడిపందేలు అంతకంటే పాపులర్. రెండింటిపైనా మొన్నమొన్నటి వరకు నిషేధం ఉంది. అయితే... ఈ రోజు కేంద్రం ప్రభుత్వం జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోడిపందేలపై రాష్ట్రం నిషేధం ఎత్తేస్తుందా ఎత్తేయదా అన్న చర్చ మొదలైంది.

జల్లికట్టు - కోడి పందాలు వంటివాటిని కోర్టులు నిషేధించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తాజాగా జల్లికట్టుకు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ సంగతిని తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు తెలియచేశారు. తమిళనాడులో సంప్రదాయబద్దంగా జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు.ఇది జంతువులను హింసించడమేనని కొందరు జంతుసంరక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా ఏపీలో కోడి పందాలపై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. కానీ... తాజా పరిణామాల నేపథ్యంలో దీనిని కూడా సంప్రదాయ క్రీడ కింద పరిగణించి ఎపి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పలువురు నేతలు కోరుతున్నారు. దీంతో కేంద్రమే సరళంగా ఉన్నప్పుడు మనం ఎందుకు పట్టుదలగా ఉండాలన్న ఉద్దేశంతో కోడిపందేలకు రాష్ట్రం ఓకే చెబుతుందని భావిస్తున్నారు. జల్లికట్టుకు కేంద్రం అనుమతించిన నేపధ్యంలో ఏపీలోనూ అనుకూల నిర్ణయం వస్తుందా లేదా అన్నది చూడాలి.