Begin typing your search above and press return to search.
కేంద్రానికి జగన్ కు మధ్య పోలవరం గ్యాప్ కారణం చెప్పిన బాబు
By: Tupaki Desk | 2 Nov 2020 10:30 AM ISTపోలవరం విషయంలో కేంద్రం వేసిన కొత్త ముడి ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది. జాతీయ ప్రాజెక్టు అన్న తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం ఖర్చు భరించాలే కానీ.. పునరావాస కార్యక్రమానికి.. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారానికి తమకు సంబంధం లేదనటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇదే విషయంపై సీఎం జగన్ సైతం కేంద్రానికి లేఖ రాయటం తెలిసిందే. కేంద్రానికి.. జగన్ సర్కారు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగే వేళ.. అసలు గ్యాప్ ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నగా మారింది.
పోలవరంపై కొంత మౌనాన్ని ప్రదర్శిస్తున్న టీడీపీ అధినేత.. విపక్ష నేత చంద్రబాబు తాజాగా స్పందించారు. పోలవరం నిధుల్ని కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలో చెప్పిన ఆయన.. కీలక అంశాల్నిప్రస్తావించారు. అన్నింటికి మించి.. కేంద్రానికి జగన్ ప్రభుత్వానికి మధ్య పోలవరం ఇష్యూలో ఉన్న గ్యాప్ ఏమిటన్న విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలంటే కేంద్రంతో సమన్వయం చేసుకొని నిధులు తెచ్చుకోవటం మినహా మరో మార్గం లేదని తేల్చారు చంద్రబాబు.
అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చును భరిస్తామన్న విషయాన్ని కేంద్ర కేబినెట్ తీర్మానంలో పేర్కొన్నారని.. ప్రాజెక్టు అంచనాల్ని కుదిస్తున్నట్లుగా అందులో ఎక్కడుంది? అంచనాలు పెంచొద్దని తీర్మానం చేస్తే ఇన్ని సమావేశాలు పెట్టి చివరకు పెంచుతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం అనుమతితోనే తాము కాంట్రాక్టు సంస్థను మార్చామని..కొత్తగా పైసా భారం పడకుండా చేసిన విషయాన్ని వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ ను మార్చే పనిలో పడ్డారని.. కేంద్రం ఆ పని చేయొద్దని సలహా ఇచ్చినట్లుగా చెప్పారు. అయినా.. వారి మాట వినకుండా వెళ్లారని.. ఆ తర్వాతే గ్యాప్ మొదలైనట్లుగా చంద్రబాబు పేర్కొనటం గమనార్హం. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకటికి పదిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి కేంద్రానికి నచ్చజెప్పి.. ఒప్పించి.. మెప్పించి ప్రాజెక్టును ముందుకు వెళ్లేలా చేశామన్నారు. గడిచిన కొద్దిరోజులుగా పోలవరం ఇష్యూ మీద మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా ఆ లోటును తీర్చేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మరి.. దీనిపై ఏపీ అధికారపక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.