Begin typing your search above and press return to search.
3 రాజధానులకు విభజన చట్టం ఓకే: కేంద్రం
By: Tupaki Desk | 10 Sept 2020 1:20 PM ISTఏపీలో మూడు రాజధానులు చేయాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం నడుస్తోంది. అయితే కేంద్రం వైఖరిపై కూడా హైకోర్టు ఆరాతీసింది.
అత్యంత ఆసక్తికరంగా మారిన 3 రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. హైకోర్టు ఉంది కాబట్టి అమరావతే రాజధాని అనుకోవడానికి లేదని కూడా కేంద్రం ఈ అఫిడవిట్లో క్లారిటీ ఇచ్చింది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు రాజధానిలో ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. హైకోర్టు మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయాధికారం అని కేంద్రం చెప్పినట్లైంది.
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. రాజధానికి ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని చెప్పింది. చట్టంలో రాజధాని ఎంపిక అని మాత్రమే ఉందని.. ఒకే రాజధాని అని మాత్రం కాదని కేంద్రం చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉంటే సాయం చేయబోమని తామెక్కడా చెప్పలేదని కేంద్రం తాజా అఫిడవిట్లో పేర్కొంది. దీంతో మూడు రాజధానులకు కేంద్రం అమోదముద్ర వేసినట్టేనని తెలుస్తోంది.
ఇక రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని హోంశాఖ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఏపీలో రాజధాని లేదా.. రాజధానుల ఏర్పాటులో కేంద్రం ప్రమేయం ఉండబోదని తేల్చిచెప్పింది. తద్వారా రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్రేమీ ఉండబోదని కేంద్రం మరోసారి చెప్పినట్టైంది.