Begin typing your search above and press return to search.

బాదుడు లెక్క‌పై మ‌రికాస్త క్లారిటీ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:47 AM GMT
బాదుడు లెక్క‌పై మ‌రికాస్త క్లారిటీ ఇచ్చేశారు
X
దేశంలో అమ‌ల‌వుతున్న ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తూ.. జీఎస్టీని తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా జూలై ఒక‌టి నుంచి అమ‌ల్లోకి తీసుకురావాల‌ని భావిస్తున్న ఈ స‌రికొత్త ప‌న్ను విధానంలో.. వ‌స్తుసేవ‌ల‌కు సంబంధించిన మ‌రికొన్నింటికి సంబంధించిన ప‌న్ను రేట్లు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై కేంద్రం మ‌రికాస్త క్లారిటీ ఇచ్చింది. గ‌తంలో కొన్ని వ‌స్తువుల‌కు సంబంధించిన ప‌న్ను రేట్ల‌పై ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఇచ్చేసిన జీఎస్టీ మండ‌లి.. తాజాగా మ‌రికొన్నింటిపైనా ప‌న్ను రేట్లు ఎలా ఉంటాయో తేల్చింది. తాజాగా తీసుకున్న నిర్ణ‌యాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేది బంగారం మీద ఫిక్స్ చేసిన ప‌న్ను రేటును చెప్పాలి.

బంగారంపై ఎంత ప‌న్ను విధిస్తార‌న్న అంశంపై చాలానే చ‌ర్చ జ‌రిగింది. అయితే.. తొలివిడ‌త దీనిపై నిర్ణ‌యం తీసుకోని కేంద్రం.. తాజాగా బంగారం.. వ‌జ్రాలు.. సాన‌బెట్ట‌ని వ‌జ్రాలు.. వెండి త‌దిత‌రాల మీద ప‌న్నురేటును నిర్ణ‌యించింది.
బంగారం మీద ప‌న్ను రేటుఎంత ఉండాల‌న్న అంశంపై జీఎస్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. వివిధ‌ రాష్ట్రాలు ప‌న్ను రేటు 2 శాతంగా ఉండాల‌ని వాదించ‌గా.. మ‌రికొన్ని 5 శాతంగా ఉండాల‌ని వాదించాయి. చివ‌ర‌కు బంగారం మీద జీఎస్టీని మూడు శాతంగా నిర్ణయించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రెండు శాతానికి ఒక శాతాన్ని అద‌నంగా చేర్చ‌టం వ‌ల్ల బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగే వీలుంది. అదే రీతిలో వ‌జ్రాలు.. వెండిపైనా ఇదే రేటు కంటిన్యూ కానుంది. ఇక‌.. సాన‌బెట్ట‌ని వ‌జ్రాల మీద 0.25 శాతం ప‌న్ను వ‌సూలు చేయ‌నున్నారు. వివిధ వ‌స్తువుల‌పైనా.. వ‌స్తు సేవ‌ల పైనా తాజాగా ఖ‌రారు చేసిన ప‌న్ను రేట్లను చూస్తే..

+ ప్రస్తుతం రూ.500 వరకు ఖరీదైన పాదరక్షలపై 9.5 శాతం పన్ను ఉంది. జీఎస్‌ టీ వచ్చాక 5 శాతమే ఉంటుంది.

+ రూ.500 కన్నా ఖరీదైన పాదరక్షలపై ఇప్పుడున్న‌ 23.1 నుంచి 29.58 శాతం వరకు ఉన్న పన్ను.. జీఎస్‌ టీ తో 18 శాతానికి త‌గ్గ‌నుంది.

+ బిస్కట్లపై 18 శాతం.

+ బ్రాండ్‌ పేరుతో అమ్మే ప్యాకింగ్ ఆహార పదార్థాలపై 5 శాతం.

+ సిల్క్‌ - జనుముపై పన్ను ఉండదు.

+ పత్తి - అన్నిరకాల సహజసిద్ధ దారాలు.. నూలుపై 5%.

+ కృత్రిమ దారాలు.. నూలుపై 18 శాతం.

* తునికాకుపై 18 శాతం.. బీడీలపై 28 శాతం ప‌న్ను

+ సిగరెట్లపై మాదిరి బీడీలపై సెస్సు ఉండదు.

+ స్వర్ణాభరణాల తయారీకి సంబంధించి ఇన్‌ పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

జీఎస్టీ అమ‌లుతో పెరిగేవి.. త‌గ్గే వాటికి సంబంధించిన అంశాల్ని క్లుప్తంగా చూస్తే..

పెరిగేవి:

+ బంగారం

+ టీవీలు

+ ఏసీలు

+ మొబైల్ బిల్లులు

+ షాంపూలు

+ డియోడ‌రెండ్లు

+ మేక‌ప్ సామాగ్రి

త‌గ్గేవి:

- ఆహార‌ధాన్యాలు

- రూ.500 లోపు చెప్పులు

- స్మార్ట్ ఫోన్లు

- ర‌వాణా సేవ‌లు

- డీటీహెచ్ సేవ‌లు

- స‌బ్బులు

- టూత్ పేస్ట్‌

- విద్యుత్‌

- కొన్ని ర‌కాల కార్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/