Begin typing your search above and press return to search.

బిట్ కాయిన్ పై కేంద్రం మరో సంచలన నిర్ణయం?

By:  Tupaki Desk   |   16 March 2021 8:30 AM GMT
బిట్ కాయిన్ పై కేంద్రం మరో సంచలన నిర్ణయం?
X
ఆన్ లైన్ కరెన్సీ అయిన ‘బిట్ కాయిన్’ లేదా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణీలో ఉంది. కొన్ని దేశాలు ఆమోదించకున్నా.. దీన్ని కొనడం ఆపడం లేదు. ఇప్పటికీ అమెరికా డాలర్ ను మించి ఇదీ రికార్డులు సృష్టిస్తూ పరిగెడుతోంది. ఒక బిట్ కాయిన్ విలువ 50వేల డాలర్లు దాటిపోయింది.

భారత దేశంలో ఇంతవరకు దీనిపై నిషేధం విధించలేదు. అయితే దేశంలో బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా చాలా మంది అమ్మడం, కొనడం చేస్తున్నారు.

అయితే క్రిప్టో కరెన్సీని మొత్తంగా నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వాటిని కలిగి ఉన్నా.. ట్రేడింగ్ చేసినా భారీ జరిమానాలు విధించాలని యోచిస్తోంది.

దీనికి కొత్త చట్టం ప్రతిపాదించినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ చట్టం తెస్తే క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసిన తొలి దేశంగా భారత్ నిలుస్తోంది.

గత ఏడాది జనవరి 4న క్రిప్టో కరెన్సీ 27734 డాలర్ల వద్ద ఉండి ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా నిలిచింది. ఆ తర్వాత 83.7 శాతం లాభపడి 58354 డాలర్లకు చేరింది. తాజాగా కొంచెం క్షీణించి 50వేల డాలర్లకు పడిపోయింది.

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ప్రకారం.. బిట్ కాయిన్ వ్యాల్యూ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ వ్యాల్యూ ఆల్ టైం గరిష్టం 58000 నుంచి 38శాతం క్షీణించింది. తిరిగి మళ్లీ 50వేలకు చేరింది. బిట్ కాయిన్ కొనుగోలు పెరగడంతో 2021 మార్చి 1వ తేదీ నాటికి దీని మార్కెట్ వాటా 61.11శాతంగా నమోదైంది.