Begin typing your search above and press return to search.

దేశంలో అంతమంది పన్ను కడుతున్నారా .. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం !

By:  Tupaki Desk   |   22 Sept 2020 10:45 AM IST
దేశంలో అంతమంది పన్ను కడుతున్నారా .. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం !
X
మన ఈ దేశంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నా కూడా ప్రభుత్వం వారినే నెత్తిమీద పెట్టుకొని ముందుకు పోతుంటుంది. అలాగే మనదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ , ఇక ఏ దేశంలో కూడా ఉండదు. అందుకే మనదేశంలో చాలా మంది ప్రభుత్వాన్ని చాలా ఈజీగా మోసం చేస్తుంటారు. ప్రభుత్వం నడవాలి అంటే దేశంలోని ప్రతి ఒక్కరు పన్ను చెల్లించే దారులు సక్రమంగా చెల్లించాలి. కానీ , ప్రస్తుతం దేశంలో పన్ను కట్టాల్సిన ప్రతి వ్యక్తి కూడా పన్ను కడుతున్నాడా అంటే .. కడుతున్నారు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 138 కోట్లమంది నివసిస్తున్న ఈ సువిశాలమైన భారతదేశంలో పన్నుకట్టే వారి సంఖ్య ... కేవలం 1% మాత్రమే.

గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్ల ఖరీదైన కార్లు అమ్ముడుపోయాయి. రూ.కోటికి తక్కువ కాని ఫ్లాట్లు లక్షల సంఖ్య లో అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో మూడు కోట్ల మందికిపైగా పర్యాటకం, వ్యాపారాల పేరుతో విదేశాలను చుట్టివచ్చారు. కానీ మన దేశంలో ఆదాయం పన్ను కడుతున్న వారెంతమందో తెలుసా? 2018–19 నుండి 2020 ఫిబ్రవరి వరకు దేశ జనాభా లో కేవలం 1 శాతం మాత్రమే పన్ను పడుతున్నారని ఆర్థిక శాఖ సహాయక మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.46 కోట్ల మంది ఆదాయ పన్ను కట్టినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ ప్రకటించింది. 138 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసింది 5.78 కోట్ల మందే. అంతేకాదు లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు వంటి వృత్తినిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నా... వీరిలో సంవత్సరానికి రూ.కోటి ఆదాయం దాటిన వారు మాత్రం 2,200 మందే. ఈ సమాచారం చూసి కేంద్రం షాక్ అయింది. దీనిపై స్పందించిన ... . కోటి రూపాయల ఆదాయం దాటిన వృత్తినిపుణుల సంఖ్య కేవలం 2,200 ఉందంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఈ గణాంకాలు ఎంత మంది పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారన్నది స్పష్టం చేస్తున్నాయని, దేశాభివృద్ధికి అందరూ పన్నులు చెల్లించాలని కోరారాయన. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారిపై ఈ భారం పడుతోందన్నారు.