Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ ఇంత తక్కువ ఎందుకు?
By: Tupaki Desk | 28 July 2020 10:45 AM ISTనోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించిన చందంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. తెలుగు రాష్ట్రాలంటే ఏమాత్రం లెక్కలేకుండా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు రెండు కలిపితే ఉమ్మడి ఏపీతో పోల్చితే కర్ణాటక చిన్న రాష్ట్రం.. జనాభా పరంగా.. నిధుల వెచ్చింపు పరంగా చాలా తక్కువే. అయితే అక్కడున్నది బీజేపీ పాలిత రాష్ట్రం.. అందుకే జీఎస్టీ చెల్లింపులో పక్కనున్న బీజేపీ పాలిత కర్ణాటకకు నిధుల వరద పారించగా.. ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న తెలంగాణ, ఏపీకి ముష్టి విదిల్చిందని ఇక్కడి నేతలు ఆడిపోసుకుంటున్నారు.
తాజాగా దేశంలోని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిధులు విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.3028 కోట్లు.. తెలంగాణకు రూ.3054 కోట్లు విడుదల చేసింది. రెండూ రాష్ట్రాలకు కలిపినా 6వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది.
అదే దేశంలో ఆర్థిక రాజధాని ఉన్న అతిపెద్ద మహారాష్ట్రకు 19628 కోట్లు విడుదల చేసింది. ఇక కర్ణాటకకు రూ.18628 కోట్లు.. తమిళనాడుకు రూ.12305 కోట్లు పరిహారం కింద అందించింది. ఇక పంజాబ్ కు సైతం రూ.12187 కోట్లు విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల కంటే జనాభాలో.. విస్తీర్ణంలో కూడా చిన్నదైన కర్ణాటకకు దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా 18వేల కోట్లు కేటాయించడంపై తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారు. ఇక పంజాబ్ కు సైతం 12వేల కోట్లు ఇచ్చారు. అదే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపినా 6వేల కోట్లు దాటడం లేదు.
ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఉత్తరాధి కీలక రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు జీఎస్టీ కింద ఇచ్చి తెలుగు రాష్ట్రాలకు మాత్రం బిచ్చం వేసినట్టు చిప్ప చేతికి ఇవ్వడం ఏంటని ఇక్కడి ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్న కేంద్రం ఇచ్చే విషయంలో మాత్రం అందులో 10శాతం కూడా కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం సమానంగా పంచాల్సిన అవసరం ఉందని ఇక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు.