Begin typing your search above and press return to search.

అన్ లాక్-3: కేంద్రం శుభవార్త

By:  Tupaki Desk   |   22 Aug 2020 9:00 PM IST
అన్ లాక్-3: కేంద్రం శుభవార్త
X
అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు ఈ మేరకు లేఖ రాశారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఆంక్షలు విధిస్తే నిబంధనల కిందకు వస్తుందని స్పష్టం చేశారు.

అన్ లాక్ 3లో భాగంగా కేంద్ర హోంశాఖ జూలై 27న రాష్ట్రాలకు పలు నిబంధనలను సూచించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రజలు కానీ.. వాహనాలు కానీ వెళ్తే వారికి లేదా వాటికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ప్రత్యేక పర్మిషన్లు, అనుమతులు, ఈపాస్ లు కూడా అవసరం లేదు. పొరుగుదేశాల నుంచి వచ్చే వాహనాల విషయంలో కూడా ఎలాంటి కొత్త నిబంధనలు లేవు.

కొన్ని రాష్ట్రాలు, కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని .. అలాంటి షరతులు పెట్టడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం తెలిపింది. రవాణా విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని.. రవాణా చైన్ దెబ్బతింటుందన్నారు.