Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్‌ పై కేంద్రం అభ్యంతరం

By:  Tupaki Desk   |   17 Aug 2019 12:22 PM GMT
పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్‌ పై కేంద్రం అభ్యంతరం
X
పోలవరం ప్రాజెక్టుపై నవయుగ ఇంజనీరింగ్‌ కు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసి, తాజా టెండర్ల కోసం వెళ్లాలని జగన్ తీసుకున్న నిర్ణ‌యంపై ఈ నెల 13న జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ) అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శ‌నివారం రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది.

శుక్రవారం రాత్రి, పిపిఎ చైర్మన్ ఆర్‌ కె జైన్ నీటిపారుదల కార్యదర్శికి లేఖ రాశారు. పోలవరం బ్యాలెన్స్ పనులను పూర్తి చేయడానికి తాజా టెండర్లను పిలవాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనవసరమని పేర్కొంది. టెండ‌ర్ల‌ను ముందుగానే మూసేయ‌డం లేదా ప్రాజెక్టు ప‌నుల‌ను తిరిగి టెండ‌ర్ చేయ‌డానికి అక్క‌డ స్కోప్ లేద‌ని కేంద్రం అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక రీ టెండ‌రింగ్ ప్ర‌క్రియ వ‌ల్ల ప్రాజెక్టు ప‌నుల విష‌యంలో తీవ్ర‌ అనిశ్చితికి గురిచేస్తుందని ఆర్కే. జైన్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర దీనిపై నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు పోల‌వ‌రం ప్ర‌క్రియ‌ను మొత్తం ఆపేయాల‌ని లేదా అబియెన్స్‌ లో అయినా ఉంచాల‌ని ఆయ‌న సూచించారు. ఈ విష‌యంలో కేంద్ర నిర్ణ‌యం ఎలా ఉన్నా జ‌గ‌న్ మాత్రం రీ టెండ‌ర్ల‌తోనే ముందుకు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యాడు.

ఇక రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యానికి వ‌స్తే మొత్తం 4,900 కోట్ల‌తో నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్‌ వర్క్స్‌ పనులకు 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు 3వేల 100 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 14 రోజుల్లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రైస్ బిడ్లు ఓపెన్ చేసి రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హిస్తారు. అంటే మొత్తంగా 14 రోజుల్లో ప్ర‌భుత్వం కొత్త సంస్థ‌తో ఒప్ప‌దం కుదుర్చుకుంటుంద‌న్న‌మాట‌.