Begin typing your search above and press return to search.
కరోనా వైరస్: కేంద్ర కీలక నిర్ణయాలు, ఆరోగ్యశాఖకు అధికారాలు
By: Tupaki Desk | 12 March 2020 8:14 AM ISTచైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంటురోగాల చట్టం 1897లోని సెక్షన్ 2 నిబంధనలను దేశమంతా అమలు చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు అందరు విధిగా అనుసరించాలి.
బుధవారం ఉన్నతస్థాయి మంత్రుల బృందం సమావేశమై కరోనా పై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, అలాగే వ్యాధి నివారణ చర్యలు తీసుకున్నారు. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఉండే అధికారాలను ఆరోగ్య శాఖ కార్యదర్శికి కూడా కేంద్రం దఖలుపరిచింది. దీంతో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు పర్యవేక్షణ, ప్రభుత్వ యంత్రాంగాలను సన్నద్ధం చేసేందుకు ఈ అధికారాలు దోహదపడతాయి.
డిప్లొమెటిక్, అఫిషియల్, యూఎన్/ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎంప్లాయిమెంట్, ప్రాజెక్ట్ వీసాలు మినహాయించి మిగతా అన్ని వీసాలను ఏప్రిల్ 15 వరకు నిలిపి వేయాలని నిర్ణయించింది. అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు పర్యాటక వీసాలు రద్దు. ఇది 13 మార్చి నుండి అమల్లోకి వస్తుంది. వీసా అవసరం లేని ప్రయాణాలు కూడా ఏప్రిల్ 15వ తేదీ వరకు రద్దు.
అత్యవసర పరిస్థితుల్లో విదేశీయులు ఎవరైనా భారత్ రావాలనుకుంటే సమీపంలోని భారత మిషన్‌ను సంప్రదించాలి. చైనా, హాంగ్‌కాంగ్, సౌత్ కొరియా, జపాన్, ఇటలీ, థాయ్‌లాండ్, సింగపూర్, ఇరాన్, మలేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ సహా ఏ దేశం నుండి ఎవరు వచ్చినా (భారతీయులు సహా) వారు 14 రోజుల పాటు తప్పని సరిగా తమ ఇళ్లకు లేదా స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత ప్రయాణించిన వారికి ఇది వర్తిస్తుంది.
అత్యవసరమైతే తప్ప భారతీయులు ఎవరు కూడా విదేశాలకు ప్రయాణించవద్దు. ఒకవేళ వెళ్లినా తిరిగి వచ్చాక 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. దేశంలో మొత్తం 60 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. కరోనా కారణంగా 58 మంది భారతీయులను ఇరాన్ నుండి తరలించింది. వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు ఉన్నారు. ఇటలీ నుండి 83 మంది ఎయిరిండియా విమానంలో బుధవారం భారత్‌కు చేరుకున్నారు. వారిలో 74 మంది భారతీయులు, తొమ్మిది మంది భారత సంతతివారు. వారిని ఢిల్లీలోని ఐజోలేషన్ కేంద్రానికి తరలించారు.