Begin typing your search above and press return to search.
అద్దె ఇళ్లలో ఉండేవారికి కేంద్రం శుభవార్త
By: Tupaki Desk | 27 Aug 2020 3:00 PM ISTఇప్పుడంతా బతుకుదెరువు కోసం పట్నాల బాట పడుతున్నారు. అక్కడ ఇళ్లను అద్దెకు తీసుకొని సంసార సాగరాన్ని ఈదుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటి అద్దెల దోపిడీ కూడా ప్రజలకు భారమవుతోంది.
ఈ క్రమంలోనే అద్దె ఇంట్లో ఉండేవారికి కేంద్రం శుభవార్త చెప్పబోతోంది. త్వరలో కొత్తగా నమూనా అద్దె చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఖాళీగా ఉండే ఇళ్లను అద్దెకు ఇస్తూ రెంటల్ హౌజింగ్ సెక్టార్ ను ప్రోత్సహించడంతో భాగంగా ఈ కొత్త అద్దె చట్టానికి కేంద్రం మెరుగులు దిద్దుతోంది.
వచ్చే నెలలోనే ఈ అద్దె చట్టానికి ఆమోదం లభిస్తుందని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.
ఈ చట్టం ప్రకారం ఖాళీగా ఉన్న 60నుంచి 80 శాతం ఇండ్లు రెంటల్ మార్కెట్లోకి వస్తాయని కార్యదర్శి మిశ్రా తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముడుపోని నిర్మాణాలను అద్దె గృహాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఈ చట్టం ప్రకారం యజమాని, అద్దెకారుడికి మధ్య తలెత్తే వివాదాలను జిల్లా కలెక్టర్ సమక్షంలో పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది. అద్దె పెంచాలంటే.. మూడు నెలల ముందు దాని గురించి నోటీసులు ఇవ్వడం వంటివి ఈ చట్టంలో చేర్చుతున్నట్టు మిశ్రా తెలిపారు. అద్దెదారులకు వేధింపులు తగ్గించడమే ఇందులో ప్రధాన ఉద్దేశం.