Begin typing your search above and press return to search.

దేశవ్యాప్తంగా హైఅలెర్ట్.. కేంద్రం హెచ్చరిక

By:  Tupaki Desk   |   8 Aug 2019 4:36 AM GMT
దేశవ్యాప్తంగా హైఅలెర్ట్.. కేంద్రం హెచ్చరిక
X
అనుకున్నట్టే అయ్యింది. నిన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారత్ తో వాణిజ్యం - దౌత్య సంబంధాలను తెంచుకున్న ప్రకటించడమే ఆలస్యం ఆ దేశంలోని సైన్యం - ఉగ్రవాదులు భారత్ పై పరోక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యారని తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేంద్రం తాజాగా గురువారం ఉదయం జమ్మూకశ్మీర్ సహా దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది.

భారత్ తో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని పాకిస్తాన్ మరో భారీ దాడులకు కుట్ర పన్నుతున్నట్టు భారత ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోకి చేరుకున్నాడు. పెద్ద ఎత్తున లష్కరే - జైషే మహ్మద్ ఉగ్రవాదుల బృందం పీవోకే ద్వారా కశ్మీర్ లోకి ప్రవేశించి పాక్ ఆర్మీ సహకారంతో భారత్ లోకి ప్రవేశించి భారీ ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసిందని తాజాగా గురువారం ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు భారీగా మందుగుండు సామగ్రి - బాంబులు - నిధులను పీవోకేలో సమకూర్చిందని ఉగ్రవాదులు భారత్ లో పెట్రేగిపోవడానికి సర్వంసన్నద్ధమయ్యారని.. అలెర్ట్ గా ఉండాలని ఐబీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేంద్రం భారత సైన్యాన్ని అలెర్ట్ చేసింది.

ఇక ముంబై - బీహార్ - హైదరాబాద్ - కోల్ కతా సహా ప్రధాన నగరాల్లో కూడా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

కాగా కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో శ్రీనగర్ - జమ్మూ రహదారిపై ప్రతీ కిలోమీటర్ కు ఒక సీఆర్పీఎఫ్ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 250 కి.మీల ఈ దూరం ఆరుగంటల్లో చేరుకునే అవకాశం ఉన్న తనిఖీలతో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసాకే పంపుతున్నారు.