Begin typing your search above and press return to search.

ఓటర్ కార్డ్ పై కేంద్రం కీలక నిర్ణయం .. వారికి ఇక కష్టమే !

By:  Tupaki Desk   |   7 Dec 2019 11:09 AM IST
ఓటర్ కార్డ్ పై కేంద్రం కీలక నిర్ణయం .. వారికి ఇక కష్టమే !
X
ఓటర్ కార్డ్ ..ప్రస్తుతం ఆధార్ కార్డ్ వచ్చింది కాబట్టి అన్నింటికీ ఆధార్ నే ఉపయోగిస్తున్నారు. కానీ , గతంలో అంటే ఆధార్ కార్డ్ లేని రోజుల్లో ఎక్కువగా అడ్రస్ ప్రూఫ్స్ కోసం ఓటర్ కార్డ్ నే ఉపయోగించేవారు. ఇక పొతే గతంలో ఓటర్ కార్డ్స్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉండగా.. వాటి స్థానంలో కలర్ ఐడీ కార్డులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ కలర్ ఓటర్ ఐడీ కార్డుల స్థానంలో స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులని కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులను కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఓటర్లకు మంజూరు చేస్తోంది. ఇక తాజాగా మంజూరు చేసే ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డ్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డ్ లో ఉన్న ఆ ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

ఈసీ హోలోగ్రామ్ కలిగి ఉన్న ఈ కొత్త ఓటర్ స్మార్ట్ కార్డును కేంద్రం ప్లాస్టిక్‌ తో రూపొందించారు.అలాగే ఈ కార్డు ని ఒకే లేయర్ తో కాకుండా అనేక లేయర్ల తో రూపొందించింది. దీనితో ఈ స్మార్ట్ కార్డ్స్ ని డూప్లికేట్ చేయడం దాదాపు అసాధ్యం. అలాగే ఈ ప్రతి స్మార్ట్ కార్డ్ పై యూనిక్ బార్ కోడ్‌ ప్రింట్ చేస్తారు. దాన్ని స్కాన్ చేస్తే.. సదరు ఓటర్ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 18 ఏళ్ళు నిండి.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులను ఇవ్వనున్నారు. అంతేకాక ఈ కార్డుల కోసం రూ.30లు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కర్ణాటక ప్రజలకు ఈ కార్డులను మంజూరు చేస్తున్న ఈసీ.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లందరికీ ఈ కార్డులు జారీ చేయబోతుంది. అటు బ్లాక్ అండ్ వైట్, కలర్ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నవారు ఈసీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. 15 రోజుల్లో ఇంటికి కొత్త ఎపిక్ ఓటర్ ఐడీ వస్తుందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ చెప్పారు.