Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ కి కేంద్రం భారీ షాక్ ...ఏంటంటే !

By:  Tupaki Desk   |   4 Feb 2020 12:22 PM IST
జగన్ సర్కార్ కి కేంద్రం భారీ షాక్ ...ఏంటంటే !
X
తెలంగాణాలో జరిగిన దిశ ఉందంతం తరువాత ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలులోకి తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికోసం ప్రత్యేకంగా ఈ యాక్ట్ ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటీవలే దిశ యాక్ట్ పేరుతో ఓ బిల్లును ఆమోదించి , కేంద్రానికి పంపింది.

అయితే , ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని తీసుకొచ్చిన బిల్లుని కేంద్రం వెనక్కి పంపింది. ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- 2019లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దండి అంటూ కేంద్ర ప్రభుత్వం దిశ బిల్లుని వెనక్కు పంపింది. కేంద్రం నుంచి ఏపి అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును, అసెంబ్లీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్‌లో ఎంట్రీలు సరిగాలేవని, వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది. దీనితో బిల్లులో కేంద్రం ఎత్తిచూపిన సాంకేతిక అంశాలను సరిచేసి మళ్లీ పంపే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలుస్తుంది.

కేంద్రం సూచించిన సాంకేతిక సమస్యను పరిష్కరించి తిరిగి బిల్లును కేంద్రానికి పంపుతారు. ఆ తరువాత కేంద్రం ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతారు. అక్కడ ఆమోదం పొందితే దిశ యాక్ట్ అమలులోకి వస్తుంది. సోమవారం సచివాలయం లో సంబంధిత శాఖాధికారులతో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. రాజమండ్రి లో 7న దిశ పోలీస్ స్టేషన్‌, వన్‌ స్టాప్ సెంటర్‌ ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు.