Begin typing your search above and press return to search.

ఆధార్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం ..!

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:43 AM GMT
ఆధార్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం ..!
X
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం లో ఆధార్ ఒక భాగమై పోయింది. ఏ కార్డ్ ఉన్నా లేకున్నా కూడా ఆధార్ కార్డ్ మాత్రం తప్పని సరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ కీలకమైన డాక్యుమెంట్. ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ పథకాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు, బ్యాంక్ సేవలకు ఆధార్ చాలా అవసరం. పలు చోట్ల ఆధార్ వివరాలు అవసరం అవుతాయి.

ఆధార్ లో మార్పులు చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆన్ లైన్ లో లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి మార్పులు చేసుకోవాలి. ఆ తర్వాత అప్ డేట్ కావడానికి సమయం పడుతుంది. ఈ ఆధార్ కార్డ్ లో అడ్రస్ విషయంలో కొంతమంది కొన్ని ఇబ్బందులకు గురౌతున్నారు. ఉపాధి కోసం చాలా మంది ఇతర ప్రాంతాల కు వలస వెళ్తున్నారు. అక్కడ బ్యాంక్స్ లో అకౌంట్స్ ఓపెన్ చేయాలి అంటే ఆధార్ లో లోకల్ అడ్రస్ అడుగుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ప్రధాన సమస్య గా మారిపోయింది.

ఈ నేపథ్యం లో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకునే విధానాన్ని గతంలో కంటే మరింత సులువు చేసింది. దీని కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా చిరునామా మార్చుకుని..ఇకపై మీరు ఎక్కడైనా కూడా బ్యాంకు ఖాతాలను తెరవొచ్చు. ఆధార్ కార్డు లో సొంతింటి చిరునామా ఉన్నప్పటికీ.. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పని చేసే ప్రాంతం చిరునామా ను ఇవ్వొచ్చు. అలాగే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి ఆధార్ కార్డులో అడ్రస్ ను ఎన్నిసార్లు అయినా మార్పు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల కు వెళ్లే వారికి ఇది చాలా ఉపయోగ కరంగా ఉంటుందని వెల్లడించింది.