Begin typing your search above and press return to search.

పాక్​ యూట్యూబ్​ ఛానెళ్ల పై కేంద్రం కొరడా.. ఆ 35 ఛానెళ్లు బ్లాక్​.!

By:  Tupaki Desk   |   22 Jan 2022 3:44 AM GMT
పాక్​ యూట్యూబ్​ ఛానెళ్ల పై కేంద్రం కొరడా.. ఆ 35 ఛానెళ్లు బ్లాక్​.!
X
మన దేశంపై విష ప్రచారం చేయడానికి పాకిస్థాన్​ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. నేరుగా పోరాడే ధైర్యం లేక దొంగ దెబ్బతీయాలని చూస్తుంటుంది. మతం పేరుతో గందరగోళం సృష్టించడం, ఉగ్రవాదులను తయారు చేయడం లాంటివి చేస్తుంది. అయితే తాజా సోషల్​ మీడియాలో భాగమై.. భారత్ పై విషం చిమ్మేఅందుకు మరోసారి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ట్విట్టర్​, యూట్యూబ్​, ఫేస్​ బుక్​ లాంటి సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు క్రియేట్​ చేసి మన దేశంపై అవాస్తవాలను ప్రసారం చేస్తోంది. అయితే ఇలా ఫేక్​ న్యూస్ ను ప్రసారం చేసే కొన్ని యూట్యూబ్​ ఛానెళ్ల మీద కేంద్రం కొరడా ఝులిపించింది. సుమారు 35 ఛానెళ్లను బ్లాక్​ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ యూట్యూబ్ ఛానెళ్లలో ప్రముఖంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సమాచారంతో పాటు కాశ్మీర్​ ఇష్యూ మీద కూడా వివిధ రకాలైన వీడియోలు చిత్రీకరించి ప్రసారం చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా మన దేశ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం కూడా వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల చనిపోయిన ఛీప్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్​ బిపిన్​ రావత్ మరణానికి సంబంధించిన ఫేక్​ న్యూస్​ ను ప్రసారం చేసినట్లు కేంద్రం గుర్తించింది. ఈ కారణంగా వాటిపై కొరడా ఝుళిపించినట్లు పేర్కొంది.

కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చెప్పిన దాని ప్రకారం 35 యూట్యూబ్​ ఛానెళ్లు, రెండు ట్విట్టర్​ అకౌంట్లు, మరో రెండు ఇన్​ స్టాగ్రామ్​ అకౌంట్లను బ్లాక్​ చేసింది. వీటితో పాటు ఫేక్​ న్యూన్​ ను విస్తరిస్తున్న మరో రెండు వెబ్​ సైట్లను కూడా బ్లాక్​ చేసినట్లు కేంద్రం తెలిపింది. అంతేగాకుండా మరో పాకిస్థాన్​ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మరో ఫేస్ బుక్​ ఖాతాను కూడా బ్లాక్ చేసింది.

బ్లాక్​ చేసిన సోషల్​ మీడియా ఖాతాలు, వెబ్​ సైట్లు అన్నీ మన దేశానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్​ ను స్ప్రేడ్​ చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. వార్తలు ప్రసారం చేయడం కంటే ఎక్కువగా వారు ఫేక్​ న్యూస్​ ను వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ యూట్యూబ్​ ఛానెళ్లను సుమారు 130 కోట్లకు పైగా మంది చూసినట్లు వెల్లడించారు. వీటికి 1.2 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నట్లు గుర్తించింది. ఆప్నీ దునియా నెట్​ వర్క్​ అనే సంస్థ సుమారు 14 ఛానెళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ అనే మరో సంస్థ 13 యూట్యూబ్ ఛానెళ్లను రన్​ చేస్తుందిని పేర్కొన్నారు. వీటినన్నింటిని చట్టానికి లోబడే బ్లాక్​ చేసినట్లు తెలిపారు.