Begin typing your search above and press return to search.
కేంద్రం వర్సెస్ ట్విట్టర్.. రగులుతున్న రగడ
By: Tupaki Desk | 10 Feb 2021 11:00 PM ISTఢిల్లీలో రైతుల ఆందోళనకు ఆయువు పట్టుగా మారింది ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం 'ట్విట్టర్'. మోడీ సహా దేశంలోని ప్రముఖులు వాడే ఈ ట్విట్టర్ ద్వారానే రైతు ఉద్యమకారులు కేంద్రప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్రం సీరియస్ అయ్యి ఉద్యమకారుల గొంతునొక్కేలా కొన్ని ఖాతాలను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ను ఆదేశించింది. కొన్ని ఖాతాలను సైతం ట్విట్టర్ బ్లాక్ చేసింది.అయితే తాజాగా ఖలిస్తాన్, పాకిస్తాన్ లింకులున్న మొత్తం 1178 ఖాతాలను బ్యాన్ చేయాలన్న కేంద్రం హెచ్చిరకల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విట్టర్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
భారత ప్రభుత్వ ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమంటూ ఒక బ్లాగ్ పోస్ట్ లో ట్విట్టర్ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు ముందే ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, ఇది చాలా వింతగానూ అసాధారణంగానూ ఉందని ట్విట్టర్ తెలిపింది. దీనిపై మరింత వివరంగా త్వరలోనే స్పందించనున్నట్లు పేర్కొంది.