Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

By:  Tupaki Desk   |   4 Feb 2021 11:12 AM IST
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
X
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం తెలిసిందే. ఈ బడ్జెట్ పై ఏపీ అధికారపక్ష నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు చెత్తగా ఉన్నాయని విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇదంతా జరిగి రెండు రోజులు కాక ముందే.. ఏపీ ప్రభుత్వ ఆగ్రహాన్ని కేంద్రం గుర్తించినట్లుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో.. రాష్ట్రానికి శుభవార్తల్ని వెల్లడించింది కేంద్రం.

2023 మార్చి నాటికి విజయనగరంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సంతోష కుమార్ గర్వార్ పార్లమెంటులో వెల్లడించారు. ఇందుకోసం రూ.73.6 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఏపీలో మరో ఏడు ఈఎస్ఐ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వనున్నారు. వీటిని గుంటూరు.. విజయనగరం.. కాకినాడ.. పెనుగొండ.. శ్రీసిటీ నెల్లూరు.. అచ్యుతాపురంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు.. పెద్ద పీట వేసింది లేదు. బడ్జెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికి పెద్దగా ప్రయోజనం కలిగింది లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒకింత ఘాటుగా రియాక్టు అయ్యారు. ఏపీపై కేంద్రం సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఘాటుగా రియాక్టు అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి.. గతంలో వచ్చిన బడ్జెట్ కంటే ఇది చాలా చెత్తగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటివేళ.. కేంద్రం ప్రకటించిన కేటాయింపులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.