Begin typing your search above and press return to search.
కేంద్రం సంచలన నిర్ణయాలు.. మొత్తం ‘ప్రైవేటు’ పరం
By: Tupaki Desk | 16 May 2020 6:05 PM ISTఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట కేంద్రంలోని మోడీ సర్కార్ 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 4వ రోజులు కూడా వివిధ రంగాలకు ప్యాకేజీలు, సంస్కరణలను ప్రకటించారు. ఈ మేరకు సంచలన నిర్ణయాలను వెలువరించారు. వివిధ రంగాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలివీ..
*విద్యుత్ డిస్కంలు ప్రైవేటీకరణ
దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా.. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు చేసేలా డిస్కంలలో సంస్కరణలు తెస్తున్నామని నిర్మల తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్ లను ప్రైవేటీకరిస్తున్నామన్నారు. నష్టాలను వినియోగదారులపై పడకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కలు ఆర్థిక భారంతో సతమతమవుతున్నాయని.. వాటిని గాడిన పెట్టడానికి రూ.90వేల కోట్లను కేంద్రం కేటాయించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రవేశపెడుతామని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించి విద్యుత్ వినియోగదారులకు షాకిచ్చారు.
*బొగ్గురంగంలో గుత్తాధిపత్యం తొలగింపు
బొగ్గురంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇక నుంచి ఎవరైనా బొగ్గు వేలంలో పాల్గొనవచ్చని.. బహిరంగ మార్కెట్ లో బొగ్గును విక్రయించుకోవచ్చని.. 50 బ్లాకులను ప్రైవేటుకు తక్షణమే కేటాయిస్తున్నామన్నారు. బొగ్గు తవ్వకాలు, మౌళిక వసతలుకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
*రక్షణ రంగంలో ఎఫ్.డీ.ఐల పరిమితి పెంపు
భద్రతా సిబ్బందికి అధునాతన రక్షణ సామగ్రి అందించాల్సిన అవసరం దేశానికి ఉందని.. మేకిన్ ఇండియాను ప్రోత్సహించి రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారితనం పెంచుతమన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ఎఫ్.డీ.ఐ పరిమితిని 49 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నామని నిర్మల ప్రకటించారు.
*ఖనిజ రంగంలోనూ ప్రైవేటు పరం
ఇక ఖనిజ పరిశ్రమల రంగంలో 500 మైనింగ్ బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. అల్యుమినియం పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇక బాక్సైట్, బొగ్గు బ్లాకులకు సంయుక్త వేలం నిర్వహిస్తామన్నారు.
* ప్రైవేటుకు 6 ఎయిర్ పోర్టులు
దేశంలోని మరో 6 ఎయిర్ పోర్టులను సైతం ప్రైవేటుకు అప్పగిస్తున్నామని.. తద్వారా ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా రూపుదిద్దేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. ఇప్పటికే దేశంలో 12 ఎయిర్ పోర్టులు పీపీపీ విధానంలో ప్రైవేటు కంపెనీలకు కేటాయించామన్నారు. భారత ఎయిర్ స్పేస్ వినియోగాన్ని హేతుబద్దీకరించి ఏడాదికి రూ.1000 కోట్ల మేర విమానయాన రంగానికి లబ్ది చేకూరుస్తామని తెలిపారు. విమానాశ్రయాల అభివృద్ధికి రూ.2300 కోట్లు కేటాయిస్తామన్నారు. 12 నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణానికి 13 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.